Pranitha Subhash: కావాలనే ఇలాంటి గ్యారెంటీ లేని జీవితాన్ని ఎంచుకుంటాం: ప్రణీత

Pranitha Subhash (tv5news.in)
X

Pranitha Subhash (tv5news.in)

Pranitha Subhash: ఈ బాపు బొమ్మ ఆర్టిస్టుులపై, వారి జీవితాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Pranitha Subhash: 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టింది కన్నడ భామ ప్రణీత. చాలాకాలం ఎదురుచూసిన తర్వాత తనకు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది'తో ప్రణీతకు మంచి గుర్తింపు లభించింది. దీనివల్లే ఎన్‌టీఆర్, మహేశ్ బాబులాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల ఈ బాపు బొమ్మ ఆర్టిస్టుులపై, వారి జీవితాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.


రామ్‌తో నటించిన 'హాలో గురు ప్రేమకోసమే' తర్వాత ప్రణీతకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అలాంటి సమయంలోనే తనకు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. అక్కడ రెండు బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించిన గుర్తింపు లభించలేదు. ఇదే సమయంలో ప్రణీత.. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఇటీవల ఆర్టిస్టుల జీవితంపై ప్రణిత పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అందరినీ ఆకర్షించేలా ఉంది.


'ఆర్టిస్టులకు సంబంధించి ఏదో క్రేజీ విషయం ఉండే ఉంటుంది. ఎందుకంటే మేము కావాలనే ఒక నిలకడలేని, గ్యారెంటీ లేని జీవితాన్ని ఎంచుకుంటాం. మేము మా శరీరాలను చాలా భయంకరమైన పరిస్థితుల్లో పెడతాం. మా జీవితం ఒక్కొక్కసారి పీక్స్‌లో ఉంటుంది లేదా భరించలేని అంధకారంలో ఉంటుంది. సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను కాస్త వ్యవధిలోనే చూసేస్తాం.'

'మేమేం చేసినా.. ఒక థ్రిల్ మమ్మల్ని దీనికి ఎప్పుడు దగ్గరగా చేస్తుంది. మేము గౌరవం లేని జీవితాలను గడుపుతుంటాం. ఆరోగ్యకరంగా లేని షెడ్యూల్స్‌లో పనిచేస్తుంటాం. పగలు, రాత్రి అని తేడా లేకుండా, కుటుంబానికి, తెలిసిన వాళ్లకి దూరంగా పనిచేస్తుంటాం. మాకు చేతనైనాదానికంటే ఎక్కువగా పనిచేస్తుంటాం. అంతా ఓ ఆర్ట్ కోసమే, సంతోషపెట్టే ఓ క్షణం కోసమే.' అని ప్రణిత పెట్టిన పోస్ట్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Tags

Next Story