Pranitha Subhash: తల్లి కాబోతున్న బాపు గారి బొమ్మ.. స్పెషల్ ఫోటో షేర్..

Pranitha Subhash (tv5news.in)
X

Pranitha Subhash (tv5news.in)

Pranitha Subhash: ఇప్పటికే కాజల్, శ్రియ లాంటి వారు సినిమాల నుండి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ ఉమెన్‌గా మారిపోయారు.

Pranitha Subhash: లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. ఎంతోమంది యంగ్ బ్యూటీలు.. తాము ప్రేమించిన వారితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందులో బాపు గారి బొమ్మ ప్రణీత కూడా ఒకరు. ప్రణీత.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. ఇంతలోనే ప్రణీత తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.

ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు అయిన కాజల్, శ్రియ లాంటి వారు సినిమాల నుండి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ ఉమెన్‌గా మారిపోయారు. కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉండగా.. శ్రియ అయితే ఓ కూతురికి జన్మనిచ్చింది. ఇంతలోనే ప్రణీత కూడా తాను ప్రెగ్నెంట్ అన్న విషయన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ప్రణీత పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

'నా భర్త 34వ పుట్టినరోజుకు.. ఆ దేవతలు మాకు ఓ అందమైన కానుకను ఇచ్చాయి' అని ప్రణీత తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టింది. తన స్కానింగ్ ఫోటోలతో పాటు తనకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన ఫోటోలను షేర్ చేసింది ప్రణీత. దీంతో సోషల్ మీడియాలో ప్రణీతకు శుభాకాంక్షలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ప్రణీతకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

Tags

Next Story