Prashanth Neel : మద్యం తాగుతూనే కథలు రాస్తా... నాకు అదే పెద్ద టాస్క్ : ప్రశాంత్ నీల్..!
Prashanth Neel : RRR తర్వాత ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసిన చిత్రం KGF: చాప్టర్ 2.. రాక్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ రేపు(గురువారం ఏప్రిల్ 14)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ లో భాగంగా సినిమా విషయాలతో పాటుగా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
తనకు మద్యం తాగే అలవాటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టాడు. తాను మద్యం సేవిస్తానని, మందు తాగుతూనే కథలు రాస్తుంటానని చెప్పుకొచ్చారు. మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో ఈ సన్నివేశాం అవసరమా? లేదా? అనేది నిర్ధారిస్తుంటానని, అయితే ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన టాస్క్ అని ఆయన వెల్లడించారు.
ఇంటర్వ్యూలో చెప్పిన దానిని కట్ చేయడకూడదు అన్న నిబంధనతో ఈ విషయాన్ని వెల్లడించారు ప్రశాంత్ నీల్.. ఇక KGF: చాప్టర్ 2 విషయానికి వస్తే.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ మూవీలో రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్ కీలకమైన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని నిర్మించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com