NTR's Dragon : ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ బ్యాచ్ ని సెట్ చేశాడు

NTRs Dragon :  ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ బ్యాచ్ ని సెట్ చేశాడు
X

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ డ్రాగన్. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేస్తాం అని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న మూవీ ఇది. చెప్పిన దానికంటే చాలా లేట్ గా విడుదల కాబోతోంది. టాప్ హీరోల మూవీస్ అంటే మామూలుగా ఒకట్రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తుంటారు. బట్ ఏకంగా వీళ్లు ఏడాది ఆలస్యంగా వస్తున్నారు అంటే ఆడియన్స్ లో ఆ మూవీపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బట్ ఎన్టీఆర్ లాంటి స్టార్ ఉంటే ఆ బజ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక మే 20న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేస్తాం అని కూడా ప్రకటించారు.

ఇక లేటెస్ట్ గా డ్రాగన్ నుంచి విడుదలైన కొన్ని ఫోటోస్ మాత్రం వైరల్ గా మారాయి. ప్రశాంత్ నీల్ తో కలిసి కొందరు ఫైటర్స్ ఫోటోస్ దిగారు. ఆ ఫోటోస్ ను వారి సొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిని చూడగానే ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన వాళ్లలా కనిపిస్తున్నారు. సిక్స్ ప్యాక్ లతో, చేతిలో గన్స్ తో ఉన్న వారి ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. మొత్తంగా వీరు ఓ ఐదారుగురు ఉన్నారు. వీరంతా చాలా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించబోతారు అనిపించేలా ఉన్నారు. వీరితో పాటు ఓ పాత కాలపు భవనం సెట్ కూడా కనిపిస్తోంది. మొత్తంగా ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరల్ గా మారాయి.

Tags

Next Story