Salaar : ప్రభాస్ పై ప్రశాంత్ నీల్ సీరియస్..

Salaar : ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారట. సలార్‌కు అనుకున్న ఫిజిక్‌ను ప్రభాస్ మెయిన్‌టెయిన్ చేయలేకపోతున్నాడని గుసగుసలు వినపడుతున్నాయి.
రెబల్ స్టార్ ఒకేసారి రెండు మూడు చిత్రాలు కమిట్ కావడంతో ఆయా పాత్రలకు తగ్గట్టు ప్రభాస్ బాడీ ఉండాలి. సలార్ షూటింగ్‌లో ఒక షెడ్యూల్‌కి మరో షెడ్యూల్‌కీ చాలా ప్రభాస్‌లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయట. ఈ విషయమై ప్రశాంత్ నీల్ సీరియస్‌గా ఉన్నట్లు తెలస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ప్రభాస్ ఫిజిక్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వ్యాపిస్తున్నాయి. రాధేశ్యామ్‌లో ప్రభాస్ ఫేస్‌కు గ్రాఫిక్స్ యాడ్ చేశారని, ఆదిపురుష్ కోసం బాడీ విపరీతంగా పెంచాడని టాక్ నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com