Prateik Babbar: ఎమీ జాక్సన్‌తో లవ్, బ్రేకప్ నా జీవితాన్నే మార్చేసింది: యంగ్ హీరో

Prateik Babbar: సినీ పరిశ్రమలో ఎన్నో ప్రేమకథలు పెళ్లి వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోతాయి. అందులో కొందరు మాత్రమే ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తారు. ఈమధ్య కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సినీ సెలబ్రిటీలు సంఖ్య పెరిగిపోతోంది. కానీ ఒకప్పుడు దీనికంటే బ్రేకప్‌లే ఎక్కువగా జరిగేవి. అలాగే ఫారిన్ బ్యూటీ ఎమీ జాక్సన్‌తో తన ప్రేమ, బ్రేకప్ గురించి బయటపెట్టాడు ఓ బాలీవుడ్ యంగ్ హీరో.
ఫారిన్‌లో పుట్టిపెరిగినా కూడా ఎమీ జాక్సన్‌కు హీరోయిన్‌గా అవకాశం మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఇచ్చింది. ముందుగా తమిళంలో హీరోయిన్‌గా పరిచయమయిన ఎమీ.. కొంతకాలం తర్వాత హిందీలో కూడా డెబ్యూ చేసింది. తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఏమాయ చేశావే'ను 'ఏక్ దివానా థా' పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌తోనే ఎమీ మొదటిసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
తన మొదటి సినిమా హీరో అయిన ప్రతీక బబ్బర్‌తో ప్రేమలో పడింది ఎమీ. కానీ కొన్నాళ్లకే వారు విడిపోయారు. అయితే ఆ బ్రేకప్ తర్వాత తాను ఎలా ఫీల్ అయ్యాడో ఇటీవల బయటపెట్టాడు ప్రతీక్. 25 ఏళ్ల వయసులో హార్ట్ బ్రేక్ అయితే అది చాలా బాధనిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రతీక్. హార్ట్ బ్రేక్ తనను చాలా మార్చేసింది అన్నాడు. అందుకే కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నానంటూ స్పష్టం చేశాడు ప్రతీక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com