Samantha Ruth Prabhu: జుకల్కర్‌ను ఆటపట్టించిన సమంత.. వీడియో వైరల్..
Samantha Ruth Prabhu: సౌత్‌లో ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్ ఎవరు అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు సమంత. తను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా సైన్ చేస్తోంది. అలా చెప్పుకుంటూ సమంత ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా పని చేస్తోంది. అయితే తనకు ఎప్పుడు కాస్త తీరిక దొరికినా.. తన ఫ్రెండ్స్‌తోనే గడపడానికి ఎక్కువగా ఇష్టపడే సామ్.. తాజాగా ఓ ఫన్నీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌తో పోస్ట్ చేసింది.
ఇటీవల సమంత పీరియాడిక్ డ్రామా అయిన 'శాకుంతలం' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం 'యశోద' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. మధ్యమధ్యలో యాడ్స్‌లో కూడా కనిపించి మెప్పిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా సామ్ తనకు తాను కొంత టైమ్‌ను కచ్చితంగా కేటాయిస్తుంది. అదే సమయంలో తన ఫ్రెండ్స్‌తో ట్రిప్స్‌కు వెళ్తూ.. ఎంజాయ్ చేస్తుంది. తాజాగా తన ఫ్రెండ్స్ జుకల్కర్‌తో కలిసి సమంత చేసిన ఓ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ప్రీతమ్ జుకల్కర్.. సమంతకు పర్సనల్ స్టైలిస్ట్. తాను కూడా సామ్ టీమ్‌లో ఒక మెంబర్. అయితే వీరిద్దరు కలిసి ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తూ.. ఫాలోవర్స్‌కు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సామ్.. జుకల్కర్‌కు హెయిర్ కట్ చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి 'మల్టీ టాలెంటెడ్ మీ' అని గర్వంగా చెప్పుకుంది సమంత. అంతే కాకుండా జుకల్కర్‌ను ఈ స్టోరీలో ట్యాగ్ చేసి 'నువ్వు నీ హెయిర్ కట్‌కు డబ్బులు ఇవ్వలేదు' అని ఆటపట్టించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com