Preity Zinta : 46 ఏళ్లకు తల్లైన హీరోయిన్.. అద్దె గర్భంతో కవలలకు జననం..!

Preity Zinta : బాలీవుడ్ బ్యూటీ, సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా(46) అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది.. తాను తల్లైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సరోగసి(అద్దె గర్భం) పద్దతిలో ఇద్దరు కవలలకి జన్మించినట్టుగా వెల్లడించింది.ఇక తన పిల్లల పేర్లను కూడా వెల్లడించింది.
" అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న అంత్యంత సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్, నేను కవలలకు జన్మనిచ్చాం. ప్రస్తుతం మా హృదయాలు కృతజ్ఞత, ప్రేమతో నిండిపోయాయి. సరోగసి ద్వారా కవలలను మా కుటుంబంలోకి స్వాగతించాం. వారి పేర్లు జై జింటా, గియా జింటా నిర్ణయించాం' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
కాగా ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రేమించి రహస్య వివాహం చేసుకుంది. అంతకుముందు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com