Prem Kumar Release Date: మరోసారి గిలిగింతలు పెట్టనున్న సంతోష్ శోభన్

Prem Kumar Release Date: మరోసారి గిలిగింతలు పెట్టనున్న  సంతోష్ శోభన్
'ప్రేమ్ కుమార్' విడుదల తేదీని వెల్లడించిన మేకర్స్

'గోల్కొండ హైస్కూల్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో సంతోష్ శోభన్ మరో కొత్తతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన లేటెస్ట్ చిత్రం‘ప్రేమ్ కుమార్’. కాగా తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ కానుందని ప్రకటించారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ మూవీలో రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటించారు. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మూవీ మరికొద్ది రోజుల్లో వెండి తెరపై ఆవిష్కృతం కానుండడంతో.. ఈ మూవీ ప‌రిచ‌య వేదిక కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్స్ రుచితా సాధినేని, రాశీ సింగ్, నిర్మాత శివ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు అభిషేక్ మ‌హ‌ర్షి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.అనంత శ్రీక‌ర్‌, కాస‌ర్ల శ్యామ్‌, రైట‌ర్ అనిరుద్ కృష్ణ‌మూర్తి, యాక్ట‌ర్ ప్ర‌భావ‌తి, యాక్ట‌ర్ అశోక్ కుమార్‌, రోల్ రైడా, సింగ‌ర్‌ ధ్రువ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


‘‘ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌.. పార్టీ ధావ‌త్ పాట‌ను విన్న ద‌గ్గ‌ర్నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా? అని ఎదురు చూస్తున్నాం. ఇప్ప‌టికీ కుదిరింది. అద్భుత‌మైన పాట‌. నిర్మాత శివ ప్ర‌సాద్‌గారితో చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం. నేను స్ట్ర‌గులింగ్ యాక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి త‌ను ప‌రిచ‌యం. ఓ రోజు సినిమా చేద్దాం అని అనుకుని ఫిక్స్ అయ్యాం. క‌థ ఫిక్స్ కావటానికి కార‌ణం సంతోష్ శోభ‌న్‌. అనంత్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. థియేట‌ర్‌లో సౌండ్ కొత్త‌గా ఉంటుంది. ఆడియెన్స్ స‌ర్‌ప్రైజ్ అవుతారు. రాశీ సింగ్‌, రుచిత ఇద్ద‌రు చ‌క్క‌గా న‌టించారు. సంతోష్ శోభన్ స్నేహితుడిగా న‌టించిన కృష్ణ తేజ అద్భుతంగా న‌టించాడు. సినిమా చూస్తున్న‌ప్పుడు మ‌న ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. బ‌య‌ట మ‌నం ఎలా ఉంటామో అదే పాత్ర‌ల‌న‌ను తెర‌పై చూస్తారు. సుద‌ర్శ‌న్ డాడీ అనే పాత్ర‌లో సూప‌ర్బ్‌గా న‌టించాడు. ఇంత వ‌ర‌కు త‌ను అలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. సుద‌ర్శ‌న్‌, అశోక్ కుమార్‌, సంతోష్ కాంబినేష‌న్ చూస్తున్నంత సేపు న‌వ్వుకుంటారు. గ్యారీ చాలా మంచి స‌పోర్ట్ ఇచ్చాడు. సినిమా బాగా రావ‌టానికి మూల కార‌ణాల్లో త‌ను ఒక‌డు. సినిమాటోగ్ర‌ఫీ రాంకీగారు మంచి విజువ‌ల్స్ అందించారు’’ అని ఈ మూవీ డైరెక్టర్ అభిషేక్ మహర్షి చెప్పారు.

‘‘అభిషేక్ మహర్షి, శివ ప్రసాద్లకు థాంక్స్. వాళ్లు నమ్మితేనే సినిమా ఇంత వ‌ర‌కు వ‌చ్చింది. నిజానికి నా సినిమాల్లో అభిషేక్ నటించాడు. త‌ను అప్పుడు డైరెక్ట‌ర్ అవుతాడ‌ని అనుకోలేదు. ఈ సినిమా త‌ర్వాత త‌నెంత మంచి డైరెక్ట‌రో అంద‌రికీ తెలుస్తుంది. భ‌విష్య‌త్తులో హ్యూమ‌ర్‌కి అభిషేక్ ఓ బ్రాండ్ అవుతాడ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను. కామెడీ సినిమా చేయ‌టం అంత గొప్ప విష‌యం కాదు.. కానీ త‌ను గొప్ప‌గా చేశాడు. శివ నిర్మాత 50 కాదు.. 150 సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. రోల్ రైడా, ధ్రువ‌న్‌, కాస‌ర్ల శ్యామ్ ఇచ్చిన ధావ‌త్ సాంగ్ చాలా బావుంది. అలాగే సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. రాశీసింగ్, రుచిత‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తిగారికి ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా మిమ్మ‌ల్ని రెండు గంటల పాటు మ‌న‌స్ఫూర్తిగా న‌వ్విస్తుందని న‌మ్ముతున్నాను. ఆగ‌స్ట్ 18న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అని హీరో సంతోష్ శోభన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.




Tags

Read MoreRead Less
Next Story