Nani HIT 3 : హిట్ 3 నుంచి ప్రేమ వెల్లువ సాంగ్

Nani HIT 3 :  హిట్ 3 నుంచి ప్రేమ వెల్లువ సాంగ్
X

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న సినిమా హిట్ 3. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. హిట్ మూవీస్ ఫ్రాంఛైజీలో వస్తోన్న మూడో సినిమా కావడం, టీజర్ కు పెద్ద రెస్పాన్స్ రావడంతో హిట్ 3 పై భారీ అంచనాలు పెరిగాయి. పైగా నాని కొన్నాళ్లుగా మాస్ మంత్రం జపిస్తున్నాడు. ఆ కోవలో ఈ మూవీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ప్రేమ వెల్లువా అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. మంచి సాహిత్యం, ట్యూన్ తో వినగానే ఆకట్టుకునే మెలోడియస్ సాంగ్ లా కనిపిస్తోంది. కంప్లీట్ మాంటేజ్ మోడ్ లో ఒకే కాస్ట్యూమ్ లో చాలా బావుందీ పాట.

‘పగలే నావైపుకి నడిచే కలవా.. పడుతూ ఎగిరే అలవా.. మనసే నిను చూడని అని ఒకటే గొడవా.. కనులే ఇపుడే చదివా.. వెంట వచ్చావే.. వెంబడించావే.. ఊపిరల్లే మారావే నేడే.. నమ్మి తీరాలే కల కాదే.. పేరుకే నేనున్నాలే ప్రాణం నీదే’.. అంటూ సాగే పాటలో ప్రతి లైన్ ప్రేమను కురిపిస్తూనే ఉంది. సింపుల్ సాగే సాహిత్యంతో కనిపిస్తోన్న ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాశాడు. మిక్కీ జే మేయర్ స్వరరచనలో సిధ్ శ్రీరామ్, నూతన మోహన్ కలిసి పాడారు.

ఇలాంటి మాంటేజ్ సాంగ్స్ విషయంలో మిక్కీ జే మేయర్ ఎప్పుడూ డిజప్పాయింట్ చేయడు. అది మరోసారి ప్రూవ్ అయిందీ పాటతో. మొదటి చరణం, రెండో చరణం మధ్య కనిపిస్తోన్న చిన్న వ్యత్యాసం చాలు.. అతనెంత ప్యాసనేట్ గా ఈ గీతాన్ని కంపోజ్ చేశాడో. సో.. ఈ పాటతో హిట్ 3కి మరింత హిట్ కళ వచ్చేసిందనే చెప్పాలి.

Tags

Next Story