Nalsen : ప్రేమలు కుర్రాడు తెలుగులో పాగా వేస్తాడా..?

ఒక భాష హీరోలు మరో భాషలో స్టార్డమ్ తెచ్చుకోవడం సినిమా పుట్టినప్పటి నుంచీ ఉంది. ఇది ఆ హీరోలకు కొత్త మార్కెట్ ను కూడా క్రియేట్ చేస్తుంది. కాకపోతే వచ్చిన ఇమేజ్ ను, స్టార్డమ్ గా మలచుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు కొందరు. గతేడాది ప్రేమలు చిత్రంతో తెలుగు వారికి బాగా నచ్చాడు హీరో నాల్సేన్. హీరోయిన్ మమితా బైజుకు తెలుగులో చాలా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. అది అవలేదు కానీ ఈ కుర్రాడు మాత్రం మళయాలంలో తాజాగా మరో హిట్ కొట్టాడు. అలప్పుళ జింఖానా అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ మమ్ముట్టి బజూక చిత్రాన్ని కూడా దాటుకుని మరీ సూపర్ హిట్ అనిపించుకుంది. కమర్షియల్ గా పెద్ద విజయమే అక్కడ. అంతే.. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. ఈ నెల 25నే తెలుగులో ఈ చిత్రాన్ని ‘జింఖానా’టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. ఇవాళ (మంగళవారం ) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హరీష్ శంకర్ కూడా వస్తున్నాడు.
ప్రేమలు తెలుగు డబ్బింగ్ చిత్రంతో నాల్సేన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది అనేది నిజం. ప్రేమలు క్రేజ్ తోనే ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ప్రేమలు మంచి కామెడీతో క్లీన్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో లవ్ స్టోరీ కంటే కూడా కొందరు కుర్రాళ్లు బాక్సర్స్ కావాలని చేసే ప్రయత్నంలో వచ్చే కామెడీ హైలెట్ గా కనిపించబోతోందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇదో మ్యాడ్, డిజే టిల్లు తరహాలో ఓ క్రింజ్ కామెడీ చిత్రం. ఆల్రెడీ మనకు ఈ చిత్రాలు వచ్చాయి కాబట్టి కొంత అలవాటయి ఉన్నారు కుర్రాళ్లు. ఆ కోవలోనే మరోసారి క్లీన్ కామెడీతో ఈ చిత్రం రూపొందినట్టుగా ఉంది. సో.. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే.. నాల్సేన్ ను తెలుగులో మార్కెట్ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. పైగా కుర్రాడు జై బాలయ్య అంటూ తెలుగు ప్రేక్షకులపై కొత్త ప్రేమలు కూడా చూపిస్తున్నాడు. ఈ మూవీ విజయం సాధిస్తే.. రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకునే అతని కోసం మళయాల దర్శకులు కథలు రాసుకుంటారేమో ఇక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com