Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ ఫస్ట్ తెలుగు మూవీ

Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ ఫస్ట్ తెలుగు మూవీ
X

మళయాలంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు సినిమా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినిమాకు మించి హీరోయిన్ మమితా బైజుతో ప్రేమలో పడ్డారు కుర్రాళ్లు. ఇలాంటి బ్యూటీ తెలుగులోనూ నటిస్తే చూడాలనుకున్నారు. అలాంటి వారి కోసమే అమ్మడి తెలుగు ఎంట్రీ రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ ప్రేమలు లాగానే తమిళ్ లో లవ్ టుడే అనే సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు నటిస్తూ డైరెక్ట్ చేసిన లవ్ టుడే అక్కడ కమర్షియల్ గానూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తర్వాత తెలుగులో డబ్ చేస్తే మరీ అక్కడంత కాదు కానీ.. ఇక్కడా ఆకట్టుకుంది. ఇప్పుడు లవ్ టుడే కుర్రాడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమితా బైజు జంటగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగులో రాబోతోంది.

ఈ డిఫరెంట్ కాంబోను మైత్రీ మూవీస్ వాళ్లు సెట్ చేశారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట. అంటే ఈ మూవీతో ఒకేసారి మమిత, ప్రదీప్ తెలుగు తెరకు పరిచయం అవుతారన్నమాట. కంటెంట్ బావుంటే ఆటోమేటిక్ గా తమిళ్, మళయాలంలో కూడా డబ్ అవుతుంది. సో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే రాబోతున్నాయి.

Tags

Next Story