అనారోగ్య కారణాలతో సినిమా కెరీర్‌కు దూరమవుతున్న ప్రముఖ దర్శకుడు

అనారోగ్య కారణాలతో సినిమా కెరీర్‌కు దూరమవుతున్న ప్రముఖ దర్శకుడు
ప్రేమమ్ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ అనారోగ్య కారణాలతో సినిమా కెరీర్‌ను విడిచిపెడుతున్నట్లు తెలిపారు.

ప్రేమమ్ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ అనారోగ్య కారణాలతో సినిమా కెరీర్‌ను విడిచిపెడుతున్నట్లు తెలిపారు. తన అభిమానులను నిరుత్సాహపరుస్తూ తన సినిమా కెరీర్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించారు. తనకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని, ఎవరికీ బాధ్యత వహించాలనే ఉద్దేశం లేదని తెలుసుకున్నానని అల్ఫోన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నోట్ ద్వారా తెలిపారు.

“నేను నా సినిమా మరియు థియేటర్ కెరీర్‌ను ముగించుకుంటున్నాను. నేను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాను. నేను ఎవరికీ బాధ్యత వహించాలని అనుకోను. షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, సాంగ్స్ చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు OTTకి కూడా పనిచేస్తాను. సినిమా నుండి వైదొలగాల్సి వస్తుందని ఊహించలేదు, కానీ నాకు వేరే మార్గం లేదు. నేను నిలబెట్టుకోలేని వాగ్దానాన్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం సహకరించనప్పుడు, జీవితం విలువ తెలుస్తుంది అని ఆల్ఫోన్స్ పుత్ర పేర్కొన్నారు.

ఆల్ఫోన్స్ పోస్ట్‌పై అభిమానులు స్పందిస్తున్నారు. మీరు స్వయంగా నిర్ణయం తీసుకోకుండా, డాక్టర్ సహాయంతో ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేయాలని సూచించారు. 2013లో నివిన్ పౌలీతో ‘నేరం’ సినిమాతో దర్శకుడిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు ఆల్ఫోన్స్. 'నేరం' కమర్షియల్ గా హిట్ అయిన తర్వాత, 2015లో, అల్ఫోన్స్ మళ్లీ నివిన్ పౌలీతో 'ప్రేమమ్' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం మలయాళంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.

అయితే అతని ఇటీవలి కాలంలో తీసిన చిత్రం పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార జంటగా నటించిన గోల్డ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అనారోగ్య కారణాలతో తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పాడనే వార్త అభిమానులను కలచి వేస్తోంది.





Tags

Read MoreRead Less
Next Story