Mahesh Babu : ఫ్లైట్ ఎక్కిన ప్రిన్స్

Mahesh Babu : ఫ్లైట్ ఎక్కిన ప్రిన్స్
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇవాళ ఉదయం ఫ్లైట్ ఎక్కాడు. ఇంతకూ ప్రిన్స్ ఎక్కడికి వెళ్లాడన్నది ఆసక్తికరంగా మారింది. జక్కన్న దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రిన్స్ రెడీ అవుతున్నారు. భారీగా గడ్డం, బాడీ పెంచేశాడు. వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రిన్స్ మరోసారి అదిరిపోయే లుక్ తో కనిపించారు. ఇంతకూ ఆయన వెళ్తున్నది అమెరికాలో ఉన్న తనయుడు గౌతమ్ దగ్గరికా? లేదా జక్కన్న వర్క్ కోసమా? అనేది క్లారిటీగా తెలియడం లేదు. ఇవాళ మార్నింగ్ హైదరాబాదు ఎయిర్ పోర్ట్లో నమ్రతమహేస్ బాబు కనిపించారు. మహేష్ స్టైలిష్ హుడీ ధరించారు. క్యాప్ పెట్టుకుని, లాంగ్ హెయిర్ అండ్ గడ్డంతో తెగ స్టైలిష్ గా ఉన్నాడు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వాటిని చూసిన ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Tags

Next Story