Prithviraj Sukumaran : పృథ్వీరాజ్ బాలీవుడ్ మూవీ

Prithviraj Sukumaran :  పృథ్వీరాజ్ బాలీవుడ్ మూవీ
X

సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడు. మళయాల టాప్ హీరోస్ లో ఒకడుగా ఉంటూనే దర్శకుడుగానూ సత్తా చాటుతున్నాడు. వైవిధకయమైన కథల్లో అద్భుతంగా ఆకట్టుకునే పృథ్వీరాజ్ రీసెంట్ గా ఎంపురాన్ 2 మూవీతో దర్శకుడుగా మరో విజయం అందుకున్నాడు. కొంత కాంట్రవర్శీ అయినా .. ఈచిత్రానికి ఆ రాష్ట్రంలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసిందని ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా పృథ్వీరాజ్ ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పాడు.

2012లోనే అతను హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అడపదడపా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా బడేమియా చోటేమియాలో విలన్ గా కనిపించాడు. తాజాగా ‘దాయ్ రా’ అనే మరో సినిమాకు ఓకే చెప్పాడు. టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న మేఘన గుల్జార్ డైరెక్ట్ చేయబోతోన్న సినిమా ఇది. మేఘనా ఇంతకు ముందు తల్వార్, రాజీ అనే చిత్రాలతో ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలను నిర్మించిన జంగిల్ పిక్చర్స్ బ్యానరే ఈ చిత్రాన్నీ నిర్మించబోతోంది.

ఇక ఈ మూవీలో పృథ్వీరాజ్ సరసన కరీనా కపూర్ నటించబోతోంది. అయితే ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తారా లేక కరీనా కీలక పాత్ర చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. పృథ్వీరాజ్ మాత్రం ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.

మరోవైపు పృథ్వీరాజ్ తెలుగులో రాజమౌళి, మహేష్ బాబు మూవీలోనూ నటిస్తున్నాడు. మొత్తంగా పృథ్వీరాజ్ సుకుమారన్ స్టోరీ సెలెక్షన్ బలే ఉంటుందని చెప్పాలి.

Tags

Next Story