SSMB29 : మహేష్ మూవీపై పృథ్వీరాజ్ ట్వీట్ కు భార్య కౌంటర్ ..

మళయాలం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగానే కాక డైరెక్టర్ గానూ అక్కడి మార్కెట్ ను షేక్ చేస్తున్నాడు. మోహన్ లాల్ తో అతను రూపొందించిన లూసీఫర్ రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఆ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ‘ఎల్ 2 ఎంపూరన్’ అనే మూవీతో వస్తున్నాడు. ఈ నెల 27న విడుదల కాబోతోందీ సినిమా. అత్యంత భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కించాడని చెబుతున్నారు. టీజర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఓ హాలీవుడ్ రేంజ్ మేకింగ్, టేకింగ్ కనిపిస్తోందనే ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ మూవీకి సంబంధించి పృథ్వీరాజ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను బట్టి చూస్తే అతను తెలుగులో రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాడు అని అనుకుంటున్నారు జనం. జనం ఏమనుకున్నా.. అతని ట్వీట్ కు అతని భార్య ఇచ్చిన రిప్లై చూసి చాలామంది ఎపిక్ రిప్లై అంటున్నారు.
ఇంతకీ పృథ్వీ ఏం పెట్టాడూ అంటే.. ‘ఇప్పుడు డైరెక్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి హ్యాండోవర్ చేశాను. ఇకపై నాకు తెలియని భాషలో రకరకాలుగా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కాస్త నెర్వస్ గా ఫీలవుతున్నాను..’అని పెట్టాడు. దీనికి అతని భార్య సుప్రియమీనన్ పృథ్వీరాజ్ రిప్లై ఇస్తూ.. ‘గుర్తుంచుకోండి.. మీకు భార్య, కూతురు ఉన్నారు’.. అని బదులిచ్చింది. అంటే అతను అంత హెక్టిక్ షెడ్యూల్స్ తో ఇంటికి కూడా వెళ్లలేనంత బిజీగా ఉన్నాడని అర్థం అనుకోవచ్చు.
ఇక పృథ్వీరాజ్ చెప్పిన ‘తెలియని భాష’ తెలుగే అంటున్నారు. తెలుగులో ఆల్రెడీ సలార్ మూవీ చేశాడు. అతను చేయగలిగినంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మహేష్, రాజమౌళి మూవీ మాత్రమే ఉంది. పైగా అతనీ సినిమాలో నటిస్తున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. సో.. అతను ఈ మూవీ గురించే అలా చెప్పాడు అంటున్నారు.
మరి రాజమౌళి ఆల్రెడీ మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్నాడు. ఆ భయంతోనే కావొచ్చు.. పృథ్వీరాజ్ భార్య ఇలా మేమూ ఉన్నాం అని గుర్తు పెట్టుకోవాలని బదులిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com