Prithviraj : ఎంపురాన్ పై విమర్శలకు పృథ్వీరాజ్ తల్లి ఘాటు రిప్లై

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఎల్ 2 :ఎంపురాన్’ మూవీపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇందులో విలన్ కు భజరంగిఅనే పేరు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గోద్రా అల్లర్ల ఘటనను చూపించడం పైనా వారు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోహన్ లాల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. నిర్మాత హిందూ సంఘాల డిమాండ్స్ ఓకే చెప్పాడు. దర్శకుడు పృథ్వీరాజ్ మాత్రం తనేం తప్పు చేయలేదు అన్నట్టుగానే ఉన్నాడు. దీంతో అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు కొందరు. ఇవి చూసి పృథ్వీరాజ్ తల్లి సుకుమారన్ మల్లిక తన కొడుకును వెనకేసుకు వస్తూ ఒక పోస్ట పెట్టారు. దానిపైనా విమర్శలు చేస్తూ బూతులు లంకించుకున్నారు. తాజాగా ఈ విమర్శలకు ఘాటుగా రిప్లై ఇస్తూ మరో పోస్ట్ పెట్టారు మల్లిక.
‘మేం మానవత్వాన్ని విస్మరించేవాళ్లంని కాదు. మమ్మల్ని వేటాడే వారికి నేను చెప్పేది ఒక్కటే. నా ఒక్క కన్నీటికి కూడా వారు జీవితాంతం దేవునికి క్షమాపణ చెప్పాలి. వారు చేయని నేరాలు చేశారని ఎవరూ చెప్పకూడదు. 70 ఏళ్లు పైబడిన తల్లిగా, నేను చెప్పేది నిజమని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలి..
ఇప్పుడు, మీడియాకు రెండు మాటలు:
మొన్న, పృథ్వీరాజ్ సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్లి "దయచేసి నా సినిమా మార్చకండి" అని అరిచాడని ఒక మీడియా వ్యక్తి తప్పుడు సమాచారం గురించి మాట్లాడటం విన్నాను. సెన్సార్ సమయంలో పృథ్వీరాజ్ అక్కడే ఉన్నాడు. సినిమా సెన్సార్ అయినప్పుడు ఏవైనా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి దర్శకుడు లేదా నిర్మాత అక్కడే ఉండాలనేది నియమం. వారికి ఇది తెలియదా? పృథ్వీరాజ్ తరచుగా తన మనసు మార్చుకునే 'మూగ'వాడా అని మరొక ఛానల్ యాంకర్ మరొక రోజు అడగడం విన్నాను. ఆ పదాన్ని బహిరంగంగా ఇలా ఉపయోగించడం తప్పు. 'ఛానల్ నుండి ఛానెల్‌కు దూకే కొంతమంది మీడియా వ్యక్తుల మాదిరిగా పృథ్వీరాజ్ తన అభిప్రాయాన్ని మార్చుకునే వ్యక్తి కాదని నన్ను చెప్పనివ్వండి.
వివిధ రాజకీయ కుటుంబాల ప్రియమైన సభ్యులకు, పృథ్వీరాజ్ ఎవరి వ్యక్తిగత, రాజకీయ వైఖరులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు.
సత్యమేవ జయతే....’’
అంటూ మరో సుదీర్ఘమైన పోస్ట్ ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఫ్ కోర్స్ దీనిపైనా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com