Priya Bhaani Shankar : పెళ్లి పీటలెక్కుతున్న మరో హీరోయిన్

Priya Bhaani Shankar  : పెళ్లి పీటలెక్కుతున్న మరో హీరోయిన్
X

ఏంటో ఈ మధ్య హీరోయిన్లంతా వరసపెట్టి పెళ్లి చేసుకుంటారు. కొందరైతే సడెన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అందుకే అంటారు కళ్యాణం వచ్చినా అదేదో వచ్చినా ఆగదు అని. లేటెస్ట్ గా శోభిత ధూళిపాల, నాగ చైతన్య మ్యారేజ్ హాట్ టాపిక్ గా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ తన పెళ్లి వార్త చెప్పింది. కాకపోతే అమ్మడు కోలీవుడ్ భామ. టివి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ ఫేమ్ తో వెండితెరపై అడుగుపెట్టిన బ్యూటీ ప్రియా భవానీ శంకర్. మొదట చిన్న పాత్రలూ చేసింది. తర్వాత హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది.

ప్రియా భవానీ తెలుగులో కూడా సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం అనే మూవీతో పరిచయం అయింది. రీసెంట్ గా గోపీచంద్ తో భీమా.. దానికి ముందు నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ దూతలో అతని వైఫ్ గానూ నటించింది. ఇక రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2లో పెద్ద పాత్రే చేసింది. అయితే ఈ మూవీలో నటించినందుకు ఆమెను చాలామంది తిట్టారట. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారట. ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. తన లాంటి హీరోయిన్ ఎవరైనా కమల్ హాసన్, శంకర్ సినిమాలో అవకాశం వస్తే వదులుకుంటుందా. అందుకే నేను చేశాను. సినిమా పోతే నేనేం చేస్తా అని వాపోయింది. అన్నట్టు ఆ ఇంటర్వ్యూలోనే అమ్మడు తన పెళ్లి గురించీ చెప్పింది.

ప్రియా భవానీ శంకర్ ఇండస్ట్రీకి రాకముందే రాజ్ వేల్ అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఉంది. అతన్నే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పింది. అతను ఇండస్ట్రీకి చెందిన వాడు కాదు. కాకపోతే ఈ పెళ్లి నెక్ట్స్ ఇయర్ చేసుకుంటారట. అదీ మేటర్.

Tags

Next Story