Priyamani Divorce Rumours: ప్రేమించి పెళ్లిళ్లు.. విడిపోతున్న జంటలు..

Priayamani Divorce Rumours: విషయం చిన్నదో పెద్దదో సర్ధుకుపోదాం అని అనుకోవట్లేదు.. మాట మాట పెరుగుతోంది. విడాకులకు దారితీస్తోంది. ఆర్ధిక స్వాతంత్రం అందుకు బలమైన కారణంగా కనబడుతోందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇదే పరిస్థితి.
మొన్నటికి మొన్న సమంత, నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రకటించి ఏడాది అవుతున్నా ఆ విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ ఇద్దరు కలిస్తే బావుండు అని ఆశిస్తున్నారు. ఇప్పుడు మరో తార ఇదే బాట పట్టినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ప్రియమణి వివాహ జీవితానికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తన భర్త ముస్తఫా రాజ్‌తో విడిపోతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. భర్తతో గొడవల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ప్రియమణి పలు మార్లు వివరించినా అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి.
ప్రియమణి.. మాధవన్‌తో కలిసి నటించిన రాకెట్రీ సినిమా సక్సెస్ మీట్ పార్టీకి తన భర్తతో కలిసి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను ప్రియమణి వివాహం చేసుకుంది.
ఆమె ఇన్‌స్టా ఐడీ ప్రియమణి రాజ్ అనే ఉంది ఇప్పటికీ.. ముస్తఫారాజ్‌కి ప్రియమణి రెండో భార్య. మొదటి భార్య అయేషాతో విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ సమయంలో ప్రియమణి మస్తఫాకు అండగా నిలబడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com