Priyamani: వారు నన్ను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా పర్వాలేదు: ప్రియమణి

Priyamani (tv5news.in)
Priyamani: సెలబ్రిటీలు.. అందులోనూ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండేవారిపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారిపై పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ప్రేక్షకులు మరింత నెగిటివిటీని పెంచేశారు. ఇటవీల తనపై వస్తున్న నెగిటివిటీపై స్పందించింది ప్రియమణి.
ప్రియమణి తెలుగులో చేసింది కొన్ని సినిమాలే. కానీ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై అలరించడంతో పాటు అప్పుడప్పుడు సినిమా అవకాశాలు కూడా అందుకుంటూ ముందుకెళ్తోంది ప్రియమణి. ఎక్కువగా ట్రోలర్స్‌పై స్పందించని ఈ నటి.. ఈసారి మాత్రం వారికి చాలా గట్టి కౌంటర్‌నే ఇచ్చింది. చాలామంది సోషల్ మీడియాలో ఏది అనాలనిపిస్తే అది అనే హక్కు ఉన్నట్టు ఫీలవుతారని తెలిపింది ప్రియమణి.
తాను కూడా తన మీద వచ్చే మీమ్స్ చూసి నవ్వుకునేదాన్ని అని బయటపెట్టింది. కానీ హద్దు మీరే ఇష్టారీతిన చేసే కామెంట్లను మాత్రం భరించలేనని చెప్పుకొచ్చింది. అందుకే కొందరినీ బ్లాక్ కూడా చేసిందట ప్రియమణి. సోషల్ మీడియా జీవితం కాదు.. అది జీవితంలో ఒక భాగం మాత్రమే అని తన అభిప్రాయాన్ని చెప్పింది ప్రియమణి. అభిమానులు తనను ఇష్టపడినా.. ఇష్టపడకపోయినా పర్వాలేదు అని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com