Priyamani: ఆ విషయంలో వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: ప్రియమణి

Priyamani (tv5news.in)
Priyamani: అలనాటి హీరోయిన్ ప్రియమణి.. దాదాపు దశాబ్దం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిపోయింది. రెండేళ్ల క్రితం విడుదలయిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తనను మరోసారి హిందీ ప్రేక్షకులకు దగ్గర చేసింది. హిందీలోనే కాదు సౌత్‌లో కూడా ప్రియమణి చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ఈ నటి తనపై వచ్చే ట్రోల్స్‌ను ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లోని అనుపమ క్యారెక్టర్ ప్రియమణికి చాలా పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ క్యారెక్టర్‌కు, తనకు ఏమైనా పోలికలు ఉన్నాయా అని అడగగా.. ఆ క్యారెక్టర్ ఒక కూల్ హోమ్ మేకర్ క్యారెక్టర్ అని, అసలు దానికి, తన ఒరిజినల్ క్యారెక్టర్‌కు పోలికే లేదని తెలిపింది. తన భర్త వంట చేస్తే తాను తింటానని బయటపెట్టింది. పైగా తనకు బయటికి వెళ్లడం పెద్దగా ఇష్టముందని, కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్తానని చెప్పింది ప్రియమణి.
తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై, ట్రోలింగ్‌పై కూడా ప్రియమణి స్పందించింది. వాటితో తాను ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నానని తెలిపింది ప్రియమణి. వాటిపై రియాక్ట్ అవ్వడం అనవసరమని అన్నారు. ఈరోజు కాకపోతే రేపు.. ఆ నెగిటివ్ కామెంట్స్ అన్ని చచ్చిపోవాల్సిందే. కాబట్టి వాటిని ఒకవైపు నుండి విని మరోవైపు నుండి వదిలేయాలని చెప్పింది ప్రియమణి.
ఒకవైళ రూమర్స్‌పై రియాక్ట్ అయితే.. ప్రేక్షకులు అందులో ఎంతోకొంత నిజముంది అనుకుంటారు కాబట్టి అసలు వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు ప్రియమణి. కేవలం నీ కుటుంబానికి, నీ భర్తకు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, ప్రపంచంతా ఏమనుకుంటుందో అనవసరమని అన్నారు. పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడే మాత్రమే తాను రియాక్ట్ అవుతానని స్పష్టం చేసింది ప్రియమణి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com