Priyamani: నా భర్తకు సమంత హాట్‌గా కనిపించింది: ప్రియమణి

Priyamani: మామూలుగా సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉంది అనగానే ప్రేక్షకులకు దానిపై స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాంటిది సమంత లాంటి హీరోయిన్ మొదటిసారి ఓ ఐటెమ్ సాంగ్‌లో నటిస్తుంది అంటే ఇక ఆ పాటపై, సినిమాపై ఏ రేంజ్‌లో ఇంట్రెస్ట్ కలుగుతుందో ఇప్పటికే చూశాం. అందుకే సెలబ్రిటీలు సైతం పుష్పలోని ఐటెమ్ సాంగ్‌లో సామ్ అందం గురించి పొగడకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా మరో నటి కూడా సమంత హాట్‌గా ఉంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఎప్పుడు ఎక్కువగా క్యూట్ క్యారెక్టర్లతో, కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను మెప్పించే సమంత.. మొదటిసారి ఐటెమ్ గర్ల్‌గా తన సత్తాచాటింది. సుకుమార్, అల్లు అర్జున్ చిత్రంలో సమంత ఐటెమ్ సాంగ్ చేస్తుంది అనగానే.. ఆ పాటపై క్రియేట్ అయిన హైప్ అంతా ఇంతా కాదు. అయితే ఆ హైప్‌కు ఏ మాత్రం తగ్గకుండా పాటను తెరకెక్కించాడు లెక్కల మాస్టర్ సుకుమార్.
పుష్పలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాట కోసం సమంత చాలానే కష్టపడింది. దీనికోసం స్పెషల్‌గా మేక్ ఓవర్ అయ్యింది. అందుకే మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా, హాట్‌గా ప్రేక్షకులకు కనిపించింది. ఈ పాటలో సమంత లుక్స్‌పై సీనియర్ నటి ప్రియమణి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంత మొత్తం కెరీర్‌లో ఇలాంటి ప్రయోగం ఎప్పుడు చేయలేదు అనుకుంటా అని చెప్పుకొచ్చింది ప్రియమణి. తాను మాత్రమే కాకుండా తన భర్త కూడా సమంత ఈ పాటలో హాట్‌గా ఉందని భావిస్తున్నారని తెలిపింది. ఇప్పటికే ఈ సాంగ్ నెంబర్ వన్ అయ్యింది అన్నారు ప్రియమణి. సమంత అయితే హాట్‌గా ఉందని మళ్లీ మళ్లీ చెప్తాను అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. అంతే కాకుండా హీరోయిన్స్ ఇప్పుడు సినిమాల విషయంలో ఏ పరిధి పెట్టుకోకుండా, కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఉంటున్నారని చెప్పారు ప్రియమణి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com