Pradeep Machiraju : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మరో పాట

యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్, యాంకర్ నుంచి హీరోయిన్ అయిన దీపిక పిల్లి జంటగా నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ టైటిల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోందీ మూవీ. నితిన్ - భరత్ ద్వయం డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు ఓ మోస్తరు స్పందన వచ్చింది. ఆ మధ్య విడుదల చేసిన పాట ఆకట్టుకుంది. తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మరో పాటను విడుదల చేశారు. రధన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని రాకేందు మౌళి రాయగా శరత్ సంతోష్, లిప్సిక పాడారు.
‘ప్రియమారా.. మౌనాల చాటు మాటలే తెలియలేదా.. కనులారా నీ అందమే చూసి నా ఎద.. ’ అంటూ సాగే ఈ పాట .. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమగీతంలా కనిపిస్తోంది. ఒకరినొకరు పొగుడుకుంటూ, తలచుకుంటూ సాగేలా ఉంది. మ్యూజిక్ బావుంది. ట్యూన్ ఆకట్టుకుంటోంది. సాహిత్యం బావుంది. పిక్చరైజేషన్ మాత్రం నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది. ఓ టాప్ హీరో సినిమా పాటలా కనిపిస్తోంది. ఈ లొకేషన్స్ గతంలో చూసినట్టుగానే ఉన్నా.. ఈ చిన్న సినిమాకు ఆ లొకేషన్ ఓ రిచ్ నెస్ ను తెస్తోంది. తమది చిన్న సినిమా కాదు అని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్టుగానూ ఉంది.
ప్రదీప్ ఇంతకు ముందే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో హీరోగా మారాడు. అది ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఈ సారి తన ఫ్రెండ్స్ నిర్మాతలుగా మారి ఈ చిత్రాన్ని రూపొందించారని చెప్పాడు. మరి ఈ సారి ఎలాంటి రిజల్ట్ అంటుకుంటాడో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com