Priyanka Arul Mohan : మాస్ కా దాస్ తో ప్రియాంక అరుళ్ మోహన్

Priyanka Arul Mohan : మాస్ కా దాస్ తో ప్రియాంక అరుళ్ మోహన్
X

సరిపోదా శనివారం సినిమాలో నేచురల్ స్టార్ నానితో ఆడిపాడిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మరో చాన్స్ కొట్టేసింది. నాని 'గ్యాంగ్' లీడర్' మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శర్వానంద్ 'శ్రీకారం' చిత్రంలో నటించింది. 'డాక్టర్' మూవీలో శివకార్తికేయన్ కి జోడీగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. దీంతో కోలీవుడ్ లోనూ అవకాశాలు వచ్చాయి. జయం రవికి జోడీగా నటించిన తమిళ్ మూవీ 'బ్రదర్' రిలీజ్ కి సిద్ధమైంది. మరో తమిళ్

సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా 'ఓజీ'లో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జోరుమీదున్న ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో జతకట్టబోతోంది. కెవి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ పేరును ఖరారు చేశారు.

Tags

Next Story