Priyanka Chopra : మరో భారీ ప్రాజెక్ట్ లోకి ప్రియాంక చోప్రా

Priyanka Chopra  :  మరో భారీ ప్రాజెక్ట్ లోకి ప్రియాంక చోప్రా
X

23 యేళ్ల క్రితం తమిళ్ సినిమాతో సినిమా నటిగా కెరీర్ ప్రారంభించింది ప్రియాంక చోప్రా. కెరీర్ ఆరంభంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. అన్నిటినీ దాటుకుని తనదైన నటనతో రాణించి ఓ దశలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనిపించుకుంది. కొన్నాళ్లుగా హాలీవుడ్ లోనూ సత్తా చాటుతూ భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి మూవీతో టాలీవుడ్ కూ ఎంట్రీ ఇస్తోంది. అఫ్ కోర్స్ ఇదీ ప్యాన్ వరల్డ్ మూవీయే. అందుకే తన క్రేజ్ ఈ మూవీకి యాడ్ అవుతుంది. తన పాత్రకు బలమైన ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటోందీ మధ్య. అందుకే రాజమౌళి మూవీకి ఓకే చెప్పింది. తాజాగా ఈ డస్కీ బ్యూటీ అకౌంట్ లోకి మరో భారీ ప్రాజెక్ట్ వచ్చింది.

అయితే ప్రియాంక చోప్రా దక్కించుకుంది కొత్త పాత్రేం కాదు. 2006, 2013లో తను నటించిన క్రిష్ చిత్రాల కొనసాగింపులో మళ్లీ ఛాన్స్ దక్కించుకుందీ బ్యూటీ. త్వరలోనే క్రిష్ 4ను రూపొందించబోతున్నాం అని గతంలోనే ప్రకటించారు. ఈ నాలుగో భాగానికి హృతిక్ రోషనే డైరెక్టర్. 2026 నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ఆ ప్రాజెక్ట్ లోకే ప్రియాంకను అఫీషియల్ గా తీసుకున్నారు. నిజానికి తను గత చిత్రాల్లో ఉంది కాబట్టి ఈ మూవీలోనూ తీసుకోవాలనే రూలేం లేదు. కథలో చిన్న మార్పులు చేస్తే తనను తప్పించొచ్చు. అలాగే ఈ ఫ్రాంఛైజీలో ఫస్ట్ మూవీ అయిన కోయీ మిల్ గయాలో ప్రీతి జింతా ఉంది. తర్వాత తను కనిపించలేదు. అలా ప్రియాంకను చేయొచ్చు. కానీ ఇంకా ప్రియాంక చోప్రాను తప్పించకపోవడానికి ఇంకా తనకు ఉన్న క్రేజే కారణం.

ఏదేమైనా రాజమౌళి, మహేష్ మూవీతో ప్రియాంక రేంజ్ మరింత పెరుగుతుంది. ఆ రేంజ్ ఈ క్రిష్ 4కు ఇంకా పెద్ద ప్లస్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Tags

Next Story