అప్పుడు నిక్‌కి 7, నాకు 17.. విధి కలిపింది ఇద్దరినీ.. : ప్రియాంక చోప్రా

అప్పుడు నిక్‌కి 7, నాకు 17.. విధి కలిపింది ఇద్దరినీ.. : ప్రియాంక చోప్రా
బాలీవుడ్ ముచ్చటైన జంట.. పదేళ్లు పెద్దైనా ప్రేమలో అదేమంత పెద్ద విషయం కాదని నిరూపించింది ప్రియాంక చోప్రా.

బాలీవుడ్ ముచ్చటైన జంట.. పదేళ్లు వ్యత్యాసం ఉన్నా ప్రేమలో అదేమంత పెద్ద విషయం కాదని నిరూపించింది ప్రియాంక చోప్రా. ది జెన్నిఫర్ హడ్సన్ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. తన భర్త నిక్ జోనస్‌తో ప్రేమలో పడటానికి 20 సంవత్సరాల కంటే ముందు టీవీలో తనను చూశారని వెల్లడించారు. చోప్రా తన అత్తగారు డెనిస్ మిల్లర్-జోనాస్‌ను గుర్తుచేసుకుంటూ, 2000లో తాను మిస్ వరల్డ్ టైటిల్ గెలవడాన్ని కుటుంబం చూసిందని చెప్పింది. ఈ విజయంతో తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పింది. హాలీవుడ్ నట జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించింది.

"నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాను అని చోప్రా హడ్సన్‌తో అన్నారు. ఆ సమయంలో "నేను ఏమి చేస్తున్నానో, ఈ ప్రపంచం ఏమిటో నాకు తెలియదు. నాకు తెలియని మరో విషయం ఏమిటంటే, నాకు కాబోయే భర్త టెక్సాస్‌లోని తన ఇంటిలో తన తల్లిదండ్రులతో కలిసి నేను మిస్ వరల్డ్ అవార్డును స్వీకరించడాన్ని చూస్తున్నాడు.

ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్‌తో సంబంధానికి ముందు చాలా మందితో డేట్ చేశానని అని చెప్పింది. అలాగే నిక్‌కి కూడా పెళ్లికి ముందు రిలేషన్స్ ఉన్నాయి. కానీ వాటి గురించి మేము మాట్లాడుకోము.. ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం అని ప్రియాంక వివరించారు. విధి మిమ్మల్ని ఇద్దరినీ కలిపిందని నమ్ముతారా అని అడిగితే..

"కావచ్చు," అని ఆమె చెప్పింది. ఏడాది వయసున్న మాల్టీ మేరీకి తల్లిదండ్రులుగా ప్రియాంక, నిక్‌లు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ తమ కెరీర్‌లో ముందుకు వెళుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story