Priyanka Chopra-Nick Jonas: రెండో బిడ్డకు ప్లాన్.. అది కూడా సరోగసీ ద్వారానే..

Priyanka Chopra-Nick Jonas: రెండో బిడ్డకు ప్లాన్.. అది కూడా సరోగసీ ద్వారానే..
X
Priyanka Chopra-Nick Jonas: బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు జనవరిలో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు.

Priyanka Chopra-Nick Jonas: బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు జనవరిలో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు.

ఆ పాప పేరు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని వారు వెల్లడించారు. బిడ్డకోసం సరోగసీ మార్గాన్ని ఎంచుకున్నందుకు ప్రియాంకను ఇంటర్నెట్‌లో చాలా మంది ట్రోల్ చేశారు. అయితే వీటికి ఏమాత్రం స్పందించని ప్రియాంక ఇది తన పర్సనల్ వ్యవహారం అని ప్రియాంక ట్రోల్స్ చేసిన వారికి సమాధానం ఇచ్చింది.

ఇప్పుడు, ఈ జంట మళ్లీ సరోగసీ ద్వారా మరొక బిడ్డ కోసం వెళ్లే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ జంటకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు స్పష్టం చేశారు. "ప్రియాంక, నిక్ జీవితాల్లో తోబుట్టువులు భాగం కాబట్టి వారు తమ మొదటి బిడ్డ మాల్తీకి కూడా ఒక తోబుట్టువు కావాలనుకుంటున్నారు.

ప్రియాంక చోప్రాకు సిద్దార్థ చోప్రా అనే సోదరుడు ఉన్నాడు. మరోవైపు, నిక్ జోనాస్‌కు కెవిన్, జో మరియు ఫ్రాంకీ జోనాస్ అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. నలుగురు సోదరులకు వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండదు.. సోదరులందరూ వారి వారి కుటుంబాలకు దగ్గరగా ఉన్నారు. ఈ ప్రేమ జంట 2018లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో మూడు రోజుల వివాహ వేడుక క్రైస్తవ మరియు హిందూ వివాహ సంప్రదాయాలను అనుసరించి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం విడదీయరానిదిగా ఉంది.

Tags

Next Story