Priyanka Chopra: ఏ బాలీవుడ్ హీరోయిన్‌కు దక్కని బంపర్ ఆఫర్‌ను కొట్టేసిన ప్రియాంక చోప్రా..

Priyanka Chopra (tv5news.in)
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అందరికంటే ముందు హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. బీ టౌన్ హీరోయిన్స్‌లో మిగతావారి కంటే ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది కూడా తనే. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌తో పెళ్లి అయిన తర్వాత సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించింది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్న ప్రియాంక.. హాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది.
'బేవాచ్' సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. ఇటీవల 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తాను 'సిటాడెల్' అనే అమేజాన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవల సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన ప్రియాంక.. కొన్నాళ్లకు సినిమాలకు దూరంగా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ అలా కాకుండా మరో క్రేజీ ఆఫర్‌ను కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు హాలీవుడ్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్వెల్ నిర్మాణంలో నటించిన ఏ హీరో అయినా పాపులర్ అవ్వాల్సిందే. అసలు ఆ సంస్థతో పనిచేస్తే చాలు అని ఇప్పటికీ ఎంతోమంది హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. అలా హాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఓ హీరో ఆంథోనీ మాకీ.
యాంట్ మ్యాన్, అవెంజర్స్:ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్:ఎండ్గేమ్లాంటి సెన్సేషనల్ చిత్రాల్లో నటించిన ఆంథోనీ మాకీ.. కెవిన్ దర్శకత్వంలో 'ఎండింగ్ థింగ్స్' అనే సినిమాను సైన్ చేశాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రియాంక.. ఆంథోనీకి జోడీగా నటించనుందని సమాచారం. ఇదే నిజమయితే.. ప్రియాంక కూడా ఇక మార్వెల్ యూనివర్స్ సపోర్ట్ కూడా లభిస్తుందని హాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com