Priyanka Jawalkar: ఆ హీరోయిన్‌కు, క్రికెటర్‌కు మధ్య ఏం జరుగుతోంది..? కన్ఫ్యూజన్‌లో నెటిజన్లు..

Priyanka Jawalkar: సినీ పరిశ్రమలో ఇద్దరు సాన్నిహిత్యంగా ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వదంతులు మొదలయిపోతాయి. అంతే కాకుండా ఓ హీరోయిన్, ఓ క్రికెటర్ మధ్య కూడా ఏదో ఉందంటూ రూమర్స్ వచ్చిన సందర్భాలు కూడా ఎక్కువే. కానీ ఇలాంటి రూమర్స్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లపై వినిపిస్తూ ఉంటాయి. తాజాగా నెట్టింట్లో ఓ హీరోయిన్, ఓ క్రికెటర్ మధ్య సాన్నిహిత్యం చూస్తుంటే వారిద్దరి మధ్య కూడా ఏదో ఉందంటూ గాసిప్స్ మొదలయిపోయాయి.
టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. అలాంటి వారిలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడానికి కష్టపడుతోంది ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండలాంటి స్టార్ హీరో సరసన డెబ్యూ చేసినా.. ప్రియాంకకు వచ్చే ఆఫర్లు మాత్రం అంతంతమాత్రమే. సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. ఈమధ్య ఓ క్రికెటర్ పోస్ట్‌కు కామెంట్ చేసి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రియాంక జవాల్కర్ ఎప్పుడు తన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తాను షేర్ చేసిన ఓ ఫోటోకు క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి సమాధానంగా ప్రియాంక 'ఎవరు?మీరా' అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అప్పుడే వీరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ క్రియేట్ చేసేలా చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com