Priyanka with Vishwak Sen : విశ్వక్ సేన్ తో ప్రియాంక

మాస్ కా దాస్ అంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. అటు బాలకృష్ణ ఇటు ఎన్టీఆర్ ఇద్దరితోనూ మంచి ర్యాపో మెయిన్టేన్ చేస్తూ ఆ ఇద్దరు హీరోల అభిమానుల అండ కూడా తెచ్చుకున్నాడు. అఫ్ కోర్స్ ఆ ఇద్దరికీ ఇతను ఫ్యాన్ బాయ్ ని అనే చెబుతాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు విశ్వక్ సేన్. మెకానిక్ రాకీ అక్టోబర్ 31న విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ పోన్ అయింది. అలాగే లేడీ గెటప్ తో లైలా అనే మూవీ చేస్తున్నాడు. వీటితో పాటు లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు.
జాతిరత్నాలు మూవీతో అదరగొట్టిన అనుదీప్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు విశ్వక్ సేన్. సితార బ్యానర్ నిర్మించబోతోన్న సినిమా ఇది. త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇదే బ్యానర్ లో అనుదీప్ డైరెక్షన్ లో రవితేజతో సినిమా రావాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరి ఇది రవితేజకు చెప్పిన కథా లేక వేరేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించబోతోంది. ఇప్పటికే తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. ప్రియాంక రీసెంట్ గా సరిపోదా శనివారంతో హిట్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో ఓ.జిలో నటిస్తోంది. ఈ టైమ్ లో విశ్వక్ మూవీ అంటే తన లైనప్ బానే ఉందని చెప్పాలి. మరి ఈ కాంబినేషన్ థియేటర్ లో మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com