Cibi Chakaravarthi : ఈ డైరెక్టర్ కి ఇంత ఓవరాక్షన్ ఏంటో..?

Cibi Chakaravarthi :  ఈ డైరెక్టర్ కి ఇంత ఓవరాక్షన్ ఏంటో..?
X

ఒక్క హిట్టు పడితే చాలు.. ఆ దర్శకులు ఎక్కడికో వెళ్లిపోతుంటారు. అలా వెళుతున్న వాళ్లలో చాలామంది తర్వాతి సినిమాల్లో కనిపించకపోవడం మాత్రం కామన్. అయితే ఒక్క హిట్టు పడ్డాక వెంటనే పెద్ద పెద్ద హీరోలతో ఆఫర్స్ రావడం మాత్రం అరుదు. అలాంటి అరుదైన దర్శకుడు సిబి చక్రవర్తి కనిపించాడు. అతగాడు చేసిన డాన్ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు. దీంతో చాలామంది హీరోలు అతనితో మూవీ చేయాలని భావించారు. అలా భావించిన వాళ్లలో నేచురల్ స్టార్ నాని ముందున్నాడు. అతనికి చెప్పిన కథ నానికి నచ్చింది. వెంటనే నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ ను ఒప్పించాడు. ఆ మేరకు ఈ మూవీ బడ్జెట్ కేవలం 60 కోట్లలో పూర్తి చేయాలని నిర్మాత చెప్పాడు. ఇందుకు సిబి చక్రవర్తి వెంటనే ఓకే చెప్పాడు. కట్ చేస్తే శ్రీనివాస్ చెన్నైలో ఆ దర్శకుడి కోసం ఓ ఆఫీస్ తీసుకున్నాడు. ఆఫీస్ కు తగ్గ ఖర్చులు కూడా మొదలు పెట్టాడు. స్టోరీ రైటింగ్ స్టార్ట్ అయింది. కట్ చేస్తే ఒక సినిమా నుంచి రజినీకాంత్ తప్పుకున్నాడు. నానితో మూవీ అని రజినీకాంత్ తప్పుకున్నాడు ఏంటీ అనుకుంటున్నారు కదా. అక్కడే ఉంది దర్శకుడి అతి తెలివి.

సిబి చక్రవర్తికి వచ్చిన ఆఫర్స్ లో రజినీకాంత్ తో కూడా ఉంది. రజినీకాంత్ ప్రస్తుతం హిట్స్ లేడు కదా. అయినా ఆ దర్శకుడితో పని చేయాలనుకున్నాడు. కాకపోతే కథలో మార్పులు చేయాలని సూచించాడట. అందుకు దర్శకుడు నో చెప్పాడు. దీంతో రజినీకాంత్ గెటవుట్ అనేశాడు. అసలు నానితో మూవీ చేయాలని సిద్ధమైన దర్శకుడు రజినీకాంత్ తో మూవీకి సిద్ధం కావడమే పెద్ద తప్పిదం. ఆ తప్పిదాన్ని దాటుకుని రజినీకి కథ నచ్చేలా చెప్పకపోవడం ఇంకో మిస్టేక్. ఇప్పుడవన్నీ ఎందుకు అని నాని నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఏకంగా తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు వెళ్లాడు.

సిబి చక్రవర్తి నాతో మూవీ చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఇప్పటికే 5 కోట్లుకు పైనే ఖర్చు చేయించాడు. అటు చూస్తే నానితో మూవీ చేయలేదు. రజినీకాంత్ మూవీకి సిద్ధం అయ్యాడు అంటూ ఆ నిర్మాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు వెళ్లాడు. విశేషం ఏంటంటే..నానికి చెప్పిన కథను వదిలేసి మరో కథ చెప్పాడట. అది నానికి కూడా నచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ కు ఏకంగా 150కోట్ల బడ్జెట్ అవుతుందట. అసలు ముందు చెప్పిన కథను వదిలేయడమే తప్పు అంటే ఇప్పుడు మరో కథ అదీ భారీ బడ్జెట్ తో అంటే చాలా పెద్ద తప్పు కదా. మరి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో కానీ.. సిబి చక్రవర్తి కేవలం ఒకే సినిమా వయసున్నవాడు. అలాంటి వాడు ఇంతమందితో ఇన్ని గేమ్స్ ఆడటం అంటే అతని కెరీర్ కే ప్రమాదం అని తెలియదా.. లేక నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకున్నాడా..?

Tags

Next Story