Baby John : అట్లీకి షాక్ ఇచ్చిన బాలీవుడ్

చాలా తక్కువ టైమ్ లోనే కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు అట్లీ. విజయ్ తో ఎక్కువ విజయాలు చూశారు. ఏకంగా అతనికి మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ కు కూడా వెళ్లి.. షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేశాడు. ఇది వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. దీంతో మనోడి పేరు మార్మోగిపోయింది. ఈ పేరుతో బాలీవుడ్ లో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. విజయ్ హీరోగా తనే డైరెక్ట్ చేసిన తెరి చిత్రాన్ని అక్కడ వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బిలతో ‘బేబీ జాన్’పేరుతో రీమేక్ చేశాడు. తను నిర్మాతగా కలీస్ అనే అతన్ని దర్శకుడుగా తీసుకున్నాడు. కాకపోతే దర్శకుడు పేరుకే అంతా తనే చేశాడు అన్నారు. ఇక ఈ మూవీ కోసం కీర్తి సురేష్ కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత హాట్ గా కనిపించింది. బేబీ జాన్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ముందుగానే అందరూ ఊహించినట్టుగా అక్కడ పుష్ప 2 ప్రభావంలో పడి కొట్టుకుపోయిందీ మూవీ.
బేబీ జాన్ ను బాలీవుడ్ జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి మరీ దారుణం అనే టాక్ రాలేదు కానీ.. కలెక్షన్స్ లేవు. మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీని నార్త్ ఆడియన్స్ ఎంత లైట్ తీసుకున్నారో తెలియడానికి. ఫస్ట్ డే ఫెస్టివల్ కాబట్టి 11.25 కోట్లు వసూలు చేసింది. కానీ నెక్ట్స్ డే కు ఆ ఫిగర్ 4.5 కోట్లకు వచ్చేసింది. దీంతో ఈ వీకెండ్ దాటే వరకు కనీసం 25 కోట్లైనా చేస్తుందా అంటున్నారు. సో.. క్లియర్ గ ఈ మూవీ అక్కడ డిజాస్టర్ అని తేలిపోయినట్టే అని బాలీవుడ్ మీడియమ్ లో వార్తలు వస్తున్నాయి. సో.. బేబీ జాన్ తో ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లో ఆకట్టుకోవాలనుకున్న అట్లీకి ఇది షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com