Naga Chaitanya : తండేల్.. మాట నిలబెట్టుకున్న నిర్మాత

Naga Chaitanya :  తండేల్.. మాట నిలబెట్టుకున్న నిర్మాత
X

చెప్పి కొట్టడంలో ఉండే కిక్ వేరే ఉంటుంది. సెంచరీ కొడుతున్నాం అని చెప్పి మరీ కొట్టేశాడు నిర్మాత బన్నీ వాసు. అక్కినేని నాగ చైతన్యను ఈ మూవీతో వంద కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యేలా చేస్తాం అని రిలీజ్ కు చాలా రోజుల ముందే చెప్పాడు నిర్మాత బన్నీ వాసు. చెప్పినట్టుగానే ఈ మూవీ ఆదివారంతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 7న విడుదలైన తండేల్ 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ప్రకటించారు.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ కోసం చైతన్య రెండేళ్లకు పైగా కష్టపడ్డాడు. ఇప్పటి వరకూ తన కెరీర్ లో ఎప్పుడూ పడనంత కష్టపడ్డాడు. అది ఫలించింది. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా.. ఫస్ట్ టైమ్ యూనానిమస్ గా నాగ చైతన్య నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. సాయి పల్లవితో పోటీ పడి మరీ గెలిచాడు అన్నారు. ఒక ఒరిజినల్ కథను లైట్ లేయర్ గా తీసుకుని దానికి ప్రేమకథను అల్లేసి ఆకట్టుకున్నాడు దర్శకుడు చందు మొండేటి. ఈ లవ్ స్టోరీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్ బోన్ లా నిలిచింది. సినిమా రిలీజ్ కు ముందే ప్రతి పాటా హిట్ అయింది. నేపథ్య సంగీతంతో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టాడు దేవీ. మొత్తంగా ఇలా చెప్పి మరీ 100 కోట్లు కొట్టడంతో అక్కినేని ఫ్యాన్స్ లోనూ కొత్త జోష్ కనిపిస్తోంది. మరి ఈ జోష్ ను నాగ చైతన్య కంటిన్యూ చేస్తే అతని రేంజ్ కూడా మరింత పెరుగుతుంది.

Tags

Next Story