Naga Vamsi : నాగవంశీ రిక్వెస్ట్ ను ఫ్యాన్స్ పట్టించుకోవాల్సిందే.?

Naga Vamsi :  నాగవంశీ రిక్వెస్ట్ ను ఫ్యాన్స్ పట్టించుకోవాల్సిందే.?
X

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ శృతి మించుతున్నాయి. సాధారణ విమర్శలను దాటి అసహ్యం కలిగే కామెంట్స్ పెట్టుకుంటున్నారు. దీని వల్ల జనరల్ ఆడియన్స్ ఎవరి సోషల్ మీడియాను ఎక్కువ ఫాలో అయితే దానికి ఇన్ ఫ్లూయొన్స్ అవుతున్నారు. సినిమాలను పట్టించుకోవడం లేదు. ఇది ఓవరాల్ గా సినిమాల కలెక్షన్లు, రిజల్ట్స్ పై ప్రభావం చూపిస్తోంది. ఒక సారి ఒక హీరో సినిమా గురించి ఇతర హీరోల ఫ్యాన్స్ నెగెటివిటీ వ్యాపింప చేస్తే ఆ హీరో వంతు వచ్చినప్పుడు వీళ్లూ అదే చేస్తారు కదా. అందుకే ఈ నాన్సెన్స్ ను ఆపేయాలని రిక్వెస్ట్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో రిక్వెస్ట్ పెట్టాడు నిర్మాత నాగవంశీ.

దేవర సినిమాను నాగవంశీ రిలీజ్ చేస్తున్నాడు. అది మాత్రమే కాదు.. అతను ఎన్టీఆర్ కు కూడా అభిమాని. ఇలా అభిమానుల మధ్య మాటల యుద్ధం వల్ల సినిమాపై నెగెటివ్ గానే ప్రభావం పడుతుందని.. దీన్ని కో ఫ్యాన్స్ అంతా ఆపేయాలని రిక్వెస్ట్ చేశాడు. నిజంగా ఇది ఓ మంచి నిర్ణయం. ఇలా ఇప్పటి వరకూ ఎవరూ ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేయలేదు. దీంతో నాగవంశీపై ఇండస్ట్రీలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజంగానే ఫ్యాన్ వార్స్ దారుణంగా ఉంటున్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ నుంచి మొదలుపెట్టి.. చివరికి యూ ట్యూబ్ లైక్స్ వరకూ కొట్టుకుంటున్నారు. ఇదంతా సాధారణ ప్రేక్షకులకు అవసరం లేదు. సినిమా బావుంటే చూస్తారు లేదంటే లేదు. కానీ ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఉండేవారిని ప్రభావితం చేస్తాయి అనేది నిజం. సో.. ఇప్పటికైనా ఇతర హీరోల అభిమానులు కాస్త సంయమనం పాటిస్తే మంచిది. లేదంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ రచ్చ చేస్తున్నారో ఆ హీరో సినిమా కూడా ఎంతో దూరంలో లేదు. అప్పుడు వీళ్లూ అదే చేస్తారు. సో.. నాగవంశీ చెప్పినట్టు కామ్ గా సినిమాను ఎంజాయ్ చేస్తే బెటర్.

Tags

Next Story