Ram Charan : ఎన్టీఆర్ పై అది గాసిప్ కాదా..?

Ram Charan :  ఎన్టీఆర్ పై అది గాసిప్ కాదా..?
X

ఒక్కోసారి నిజాలు గాసిప్స్ లాగానూ, గాసిప్స్ నిజాలుగానూ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోస్, డైరెక్టర్స్ విషయంలో ఇది జరుగుతుంది. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్ట్స్ మూవీ ఇదే అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ముఖ్యంగా అతను తర్వాతి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్నాడు అనే న్యూస్ బాగా వినిపించింది. అయితే అది నిజం కాదట. అతని లైనప్ వేరే ఉంది అంటూ నిర్మాత నాగవంశీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎందుకంటే త్రివిక్రమ్ లైనప్ నిజంగానే వెరైటీగా ఉంది.

త్రివిక్రమ్ డైలాగ్స్ తో తనదైన టైమింగ్ తో గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల్లో అదరగొట్టాడు విక్టరీ వెంకటేష్. ఆ రెండు చిత్రాలకు దర్శకుడు విజయ్ భాస్కర్. త్రివిక్రమ్ డైరెక్టర్ అయిన దగ్గర నుంచి వెంకీతో ఓ సినిమా చేస్తే చూడాలని చాలామంది అనుకుంటున్నారు. ఫైనల్ గా వారి కోరిక నెరవేరబోతోంది. త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ వెంకటేష్ తోనే ఉండబోతోందని క్లారిటీ ఇచ్చాడు నాగవంశీ. ఖచ్చితంగా ఇది వెంకీ కెరీర్ లో హయ్యొస్ట్ ఓపెనింగ్స్ తెచ్చే సినిమా అవుతుందనుకోవచ్చు.

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత సెట్ కావాల్సిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా సినిమా ఉందని చెప్పాడు నాగవంశీ. నిజానికి ఇది రూమర్ అనుకున్నారు చాలామంది. ఎందుకంటే రామ్ చరణ్ తో చేస్తున్నాడు అనేది చాలామంది నమ్మారు. కానీ అదే రూమర్ అయింది. ఎన్టీఆర్ తో రూమర్ అనుకున్న న్యూస్ నిజమైంది. సో.. మరి ఎన్టీఆర్ తో మైథలాజికల్ మూవీ చేస్తాడా లేక వేరే సబ్జెక్ట్ తో వస్తాడా అనేది తర్వాతి మేటర్ కానీ.. ప్రస్తుతానికి త్రివిక్రమ్ లైనప్ ఇది మాత్రమే.. అంచేత ఇంకే వార్తలూ నమ్మొద్దు అంటూ నాగవంశీ తేల్చి చెప్పాడు.

Tags

Next Story