Nagavanshi : పెయిడ్ ప్రీమియర్స్ పై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు

సంక్రాంతి లాంటి బిగ్ సీజన్ టైమ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇండస్ట్రీకి శరాఘాతంలా తగిలింది. ఇకపై బెన్ ఫిట్ షోస్, టికెట్ రేట్లు పెంచడాలు ఉండవు అని చెప్పాడు ముఖ్యమంత్రి.నైజాం లాంటి పెద్ద మార్కెట్ లో అలాంటివేం లేకపోవడం సినిమాలకు పెద్ద దెబ్బ అవుతుందనేది కాదనలేని నిజం. ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ కు కనీసం టికెట్ ధరలు పెంచుకునే అవకాశం అయినా ఉంటుందనుకుంటే అదీ ఉండదని చెప్పాడు రేవంత్ రెడ్డి.
అయితే ఈ విషయంపై ఇండస్ట్రీలో రకరకాల వాదనలు వినిపిస్తాయి అనుకున్నారు. మాకు బెన్ ఫిట్ షోస్, పెయిడ్ ప్రీమియర్స్ అక్కర్లేదు అని స్పష్టం చేస్తున్నాడు డాకూ మహరాజ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. కాకపోతే ఉదయం 4.30 గంటలకు షో పడితే చాలు అంటున్నాడు. అంటే ఎక్స్ ట్రా షోస్ కు పర్మిషన్ ఇస్తే చాలు అనేది ఆయన భావన కావొచ్చు.
మరోవైపు రీసెంట్ గానే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్ గా నియమించబడిన దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మొదట ఆయన మూవీనే రిలీజ్ కాబోతోంది కాబట్టి.. ఆయన ఏం చెబితే అదే ఫాలో అవుతాం. దిల్‌రాజుగారు హైదరాబాద్ వచ్చాక అందరూ కలిసి డిసైడ్ చేసి మాట్లాడుతాం. అన్నాడు. అలాగే.. నేను హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నా ఏపీకి వెళ్లి ఏం చేస్తాను..? అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాడు. మొత్తంగా దిల్ రాజు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రకటనపై సమీక్ష జరుగుుతంది. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com