సినిమా

గుండెపోటుతో సినీ నిర్మాత మృతి

గుండెపోటుతో సినీ నిర్మాత మృతి
X

ప్రముఖ నిర్మాత ఎస్.కె.కృష్ణకాంత్ బుధవారం మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. కృష్ణకాంత్ గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు అయితే బుధవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసంలో గుండెపోటు కారణంగా మరణించారు. కాగా కృష్ణకాంత్ శింబు నటించిన మన్మథుడు,కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి చిత్రాలను నిర్మించారు. పలువురు నిర్మాతలు, దర్శకులు కృష్ణకాంత్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

Next Story

RELATED STORIES