Pahalgam : పహల్గామ్ ఘటనపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెస్ నోట్ రిలీజ్

ఏప్రిల్ 22, 2020న బైసరన్ లోయలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా చంపి, 20 మందికి పైగా గాయపరిచిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేస్తోందని చెబుతూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ దాడిని యావత్ దేశం ఖండించిందని, బాధను వ్యక్తం చేసింది. దోషులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వానికి తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది అని ప్రతిజ్ఞ చేసింది.
ప్రభుత్వానికి పూర్తి మద్దతును అందిస్తున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న గట్టి ప్రయత్నాలు, కఠినమైన చర్యలను గుర్తిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటుంది అని తెలియజేసింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమ విచారాన్ని వ్యక్తం పరుస్తూ, బాధితులకు నివాళులు అర్పిస్తూ, ప్రభుత్వానికి, బాధితుల కుటుంబాలకు తన మద్దతును తెలియజేయడానికి 2025 ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్లోని ఫిలిం నగర్ లోని రామానాయుడు కళామండపం నుండి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తుందని ఈ ప్రెస్ నోట్ లో తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com