Suriya : కంగువా సెకండ్ పార్ట్ పై నిర్మాత క్లారిటీ

Suriya :  కంగువా సెకండ్ పార్ట్ పై నిర్మాత క్లారిటీ
X

ఈ వారం విడుదలైన కంగువా సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ వచ్చింది. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో అదరగొట్టింది మూవీ టీమ్. ఏకంగా 2 వేల కోట్లు వస్తాయి అని చెప్పాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. సూర్య మాత్రం ఎప్పట్లానే తనో అద్భుతమైన నటన చూపించానని చెప్పుకున్నాడు. ఓ బ్లాక్ బస్టర్ వస్తోందన్నట్టుగా చెప్పాడు. నిజానికి ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీపై అంచనాలున్నాయి. ఆ అంచనాలను క్రియేట్ చేయడంలో మూవీ టీమ్ సూపర్ సక్సెస్ అయింది. కానీ సినిమాలో విషయాన్ని చూపడంలో ఫెయిల్ అయింది. దేశవ్యాప్తంగా 170 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ మూవీ అందులో మూడో వంతు కూడా సాధించడం కష్టమే అనేలా ఉంది పరిస్థితి.

ఇలాంటి టైమ్ లో కంగువా పార్ట్ 2 గురించిన డిస్కషన్స్ కూడా వస్తుండటం విశేషం. అయితే సెకండ్ పార్ట్ కు సంబంధించి నిర్మాత ఓ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కంగువా దర్శకుడు శివకు ఆల్రెడీ వేరే కమిట్మెంట్స్ ఉన్నాయట. అందులో భాగంగా అతను తనకు బాగా కలిసొచ్చిన.. తను ఎక్కువ హిట్స్ ఇచ్చిన అజిత్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడు. 2025 సమ్మర్ లో ఈ సినిమా పట్టాలెక్కుతుందట. అంటే అది పూర్తయ్యి రిలీజ్ వరకూ రావాలంటే 2026 సమ్మర్ వరకూ వెళుతుంది. అప్పుడు కంగువా గాయాలు మానిపోతే అప్పటికీ నిర్మాత, హీరో రెడీగా ఉంటే.. కంగువా 2 స్టార్ట్ అవుతుంది. సో.. ఇది కూడా సలార్ 2, దేవర 2 లాగా ఎప్పటికి వస్తుందో ఎప్పటికీ చెప్పలేని పరిస్థితి అనుకోవచ్చు.

Tags

Next Story