Public Talk: టూర్లలో బిజీ అయిన జక్కన్న.. మహేష్ స్క్రిప్ట్ పై ఫ్యాన్స్ ఆందోళన

Public Talk: టూర్లలో బిజీ అయిన జక్కన్న.. మహేష్ స్క్రిప్ట్ పై ఫ్యాన్స్ ఆందోళన
X
మహేష్ బాబు సినిమాపై ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని రాజమౌళి

దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్‌లో రాజమౌళి ఏ తరహా జాగ్రత్తలు తీసుకుంటాడో, ప్రేక్షకులతో ఆకట్టుకునే కథనాలను రూపొందించడానికి ఎంత సమయం తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కొత్త సినిమాపై ఆ స్టార్ డైరెక్టర్ కాస్తయినా ఫోకస్ పెడుతున్నారా అనే సందేహం ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.

'బాహుబలి', 'RRR' వంటి ప్రాజెక్ట్‌లను అద్భుతంగా చిత్రీకరించి, భారతీయ సినిమా ఖ్యాతిని ఎక్కడో తీసుకువెళ్లాడు రాజమౌళి. దార్శనికత కలిగిన చిత్రనిర్మాతగా రాజమౌళి నిదర్శనంగా నిలుస్తాడు. ఏది ఏమైనప్పటికీ, స్క్రిప్ట్ రైటింగ్ ప్రాసెస్‌లో దర్శకుడి విస్తృతమైన అంకితభావం, రాబోయే ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఉన్న అభిమానులకు వేచి చూడాల్సిన పరిస్థితికి దారితీసింది.

కానీ రాజమౌళి ఇటీవలే తమిళనాడు రోడ్ ట్రిప్, ప్యారిస్‌ విహారయాత్ర, VFX-పరిశోధన యాత్ర, మొదలుపెట్టాడు. ఇప్పుడు తన కుటుంబంతో సహా నార్వేకు ఒపెరా హౌస్‌లో బాహుబలి-1 స్క్రీనింగ్‌తో సహా అనేక కుటుంబ పర్యటనలలో పాల్గొనడంతో, మహేష్ అభిమానులు స్క్రిప్ట్ గురించి ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాజమౌళి ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా ఈ తరహా సందేహాలు సమంజసం కాదని మరికొందరు భావిస్తున్నారు. స్ర్కిప్టు విషయంలో ఆయన నిబద్దతగా, ఖచ్చితత్వంతో ఉంటారో మనందరికీ తెలియంది కాదు. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ కు దూరంగా ఉండడానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుందని మరికొందరు అంటున్నారు. కాబట్టి ఏదేమైనా దర్శకుడి వ్యక్తిగత పర్యటనలు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ స్క్రిప్ట్‌ను రాసే, వాటిని చక్కగా ట్యూన్ చేసే ప్రక్రియలో భాగమే అని మరికొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.

Next Story