SP Balasubrahmanyam : 339 కేజీల చాక్లెట్ తో ఎస్పీ బాలు విగ్రహం!

SP Balasubrahmanyam : 339 కేజీల చాక్లెట్ తో ఎస్పీ బాలు విగ్రహం!
SP Balasubrahmanyam : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam)కు ఓ బేకరీ యాజమాన్యం ఘన నివాళిని అర్పించింది.

SP Balasubrahmanyam : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam)కు ఓ బేకరీ యాజమాన్యం ఘన నివాళిని అర్పించింది. పుదిచ్చేరి మిషిన్ వీధిలో 5.8 అడుగుల ఎత్తున బాలు విగ్రహాన్ని తయారుచేసింది. రాజేంద్రన్(Rajendran) అనే కళాకారుడు 339కేజీల చాక్లెట్ తో 161 గంటలు కష్టపడి దీనిని తయారుచేశాడు. జనవరి 03 వరకు ఈ విగ్రహాన్ని సందర్శించవచ్చునని వెల్లడించాడు. గతంలో ఈ బేకరీ యాజమాన్యం సచిన్, రజినీ, అబ్దుల్ కలాం(f APJ Abdul Kalam), ఆర్మీ కమాండర్ అభినందన్‌ విగ్రహాలను తయారుచేసింది. ఎస్పీబీ చాక్లెట్ విగ్రహం ఫోటోలు ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఆగస్టు 5 న కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఎస్పీ బాలు చేరగా, ఆగస్టు 13 న అయన ఆరోగ్యం క్షీణించింది. కరోనాను బాలు జయించినప్పటికీ వేరే అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 25 న మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story