KGF2: కేజీఎఫ్2లో అదిరిన పంచ్ డైలాగులు.. రాసింది స్టార్ హీరో మరి..
KGF2: బొమ్మ బ్లాక్ బస్టరే.. ట్రైలర్ చూస్తేనే అర్ధమైపోతుంది.. ఇంక డైలాగ్స్ గురించి చెప్పేదేముంది.. యశ్ అభిమానులు ఎక్కడ చూసినా ఇవే మాటలు మాట్లాడుకుంటున్నారు..
KGF చాప్టర్ 2 ట్రైలర్ ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. యశ్ డైలాగ్‌లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లాక్ బస్టర్ KGF చిత్రానికి నటుడు యష్ చాలా డైలాగ్స్ రాశారని, ఈ చిత్రానికి కూడా అతడే రాశాడని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో నీల్ ఈ విషయం చెప్పారు.
ట్రైలర్‌కు ప్రశంసలు లభిస్తుండగా, యష్ డైలాగ్‌లు కూడా ఫేమస్ అయ్యాయి. వాటిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా తయారయ్యాయి. ట్రైలర్‌లో ప్రదర్శించిన అన్ని డైలాగ్‌లలో, అతని 'వైలెన్స్' డైలాగ్ ప్రేక్షకులకు చాలా నచ్చినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో 'వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్.. వైలెన్స్ లైక్స్ మీ''.. ఇప్పుడు 'కేజీయఫ్' ప్రేమికులందరూ చెబుతున్న డైలాగ్ ఇది. ఈ డైలాగే ట్రెండింగ్‌లో ఉంది.
డైలాగ్స్‌తో పాటు, అభిమానులు సినిమాటోగ్రఫీని, సినిమాలోని విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌ను కూడా ప్రశంసిస్తున్నారు. సంజయ్ దత్, రవీనా టాండన్ ల నటన కూడా ప్రశంసలను అందుకుంటోంది.
సినిమా విడుదలకు ముందే రిలీజైన ట్రైలర్ కూడా రికార్డులను బద్దలు కొట్టింది. 24 గంటల్లోనే దీనికి 109 మిలియన్లకు పైగా వీక్షించారు. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 ప్రేక్షకులముందుకు రానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com