Puneet Rajkumar : గుండెపోటుతో పునీత్ అభిమాని మృతి

Puneet Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్న ఇక అతను లేడన్న నిజాన్ని అభిమానులు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.. తాజాగా నంజన్‌గూడ్‌కు చెందిన పునీత్ రాజ్‌కుమార్ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన నంజన్‌గూడు తాలూకాలోని హెడియాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మంజుల కుమారుడు ఆకాష్ (22) గుండెపోటుతో మృతి చెందాడు.. ఆకాష్.. దివంగత నటుడు పవర్ స్టార్ కి వీరాభిమాని.. మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అతని చివరి సినిమా 'జేమ్స్' విడుదలైంది. ఈ సందర్భంగా హెడియాల గ్రామంలో ఘనంగా వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఆకాష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు కానీ ఆకాష్ ప్రాణాలు మాత్రం దక్కలేదు.. ఆకాష్ అప్పుకి నిజమైన అభిమాని... పునీత్ అన్ని సినిమాలను చూశాడు. పునీత్ రాజ్ కుమార్ మృతి చెందడం పట్ల ఆకాష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడని అతని స్నేహితులు వెల్లడించారు.
కాగా గతేడాది అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించగా ఇప్పుడు అదే గుండెపోటుతో అప్పూ అభిమాని కూడా మరణించడం అభిమానులకు మరింత కలిచివేస్తోంది. అతని ఆత్మకు శాంతి కలగాలని పునీత్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com