Puneeth Rajkumar: తండ్రి బాటలోనే కొడుకు.. పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత కూడా..

Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ సేవా కార్యక్రమాలతో కర్ణాటక ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. వేరేవారికి సాయం చేసే విషయంలో పునీత్‌కు అన్నీ ఆయన తండ్రి పోలికలే అంటూ ఉంటారు అందరూ. కష్టం అంటూ తన దగ్గరికి వస్తే పునీత్ వారికి సాయం చేయకుండా ఉండరరు. అలాంటి మనిషి తాను చనిపోయిన తర్వాత కూడా మరొకరికి ఉపయోగపడడానికి ప్రయత్నిస్తున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ తన మరణం తర్వాత తన కళ్లను డొనేట్ చేశారు. ఇప్పుడు ఆయన మరణ విషయం అందరినీ కలచివేస్తున్నా ఆయన కళ్లు మాత్రం ఇంకా మన మధ్యే ఉంటాయన్న విషయం కాస్త ఆనందాన్ని కలిగిస్తోంది. అప్పట్లో ఆయన తండ్రి రాజ్‌కుమార్ కూడా తన మరణాంతరం తన కళ్లను డొనేట్ చేశారు.
రాజ్‌కుమార్, ఆయన కొడుకు పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా వారి కళ్లతో ఈ లోకాన్ని చూస్తూనే ఉండడం చాలా గొప్ప విషయం. ఇది తెలుసుకున్న పునీత్ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజ్‌కుమార్ కుటుంబానికే శాండల్‌వుడ్‌లో చాలమంది అభిమానులు ఉన్నారు. అందులోనూ పునీత్ రాజ్‌కుమార్ తన మంచితనంతో మరికొందరు అభిమానులను సంపాదించుకున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com