Puneeth Rajkumar: తండ్రి పార్థివదేహాన్ని చూసిన ధృతి.. వెంటనే..

Puneeth Rajkumar: కంటే కూతుర్నే కనాలంటారు. అలా ఎందుకంటారో పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహం దగ్గర ఆయన కూతురు ధృతిని చూస్తే అర్థమవుతోంది. తండ్రి చనిపోయిన సమయానికి అమెరికాలో ఉన్నా వెంటనే బయల్దేరి వచ్చింది. తండ్రి భౌతికకాయం చూసిన వెంటనే ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనైంది. ఏ తండ్రికి అయినా కూతురంటే గారాల పట్టే. అలాగే ఏ అమ్మాయికి అయినా తండ్రే రియల్ హీరో. తనను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన నాన్నను అలా చూసేసరికి ధృతి తట్టుకోలేకపోయింది.
పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా గుండెపోటుుతో మరణించారు. కానీ అంత్యక్రియలు మాత్రం ఆదివారం చేయాలని అప్పుడే నిర్ణయించారు. పునీత్ పార్థివదేహాన్ని తన ఫ్యాన్స్ సందర్శనకు పెట్టడమే కాకుండా తన కూతురు ధృతి విదేశాల్లో ఉండడం కూడా దీనికి ముఖ్య కారణం. ఇక తండ్రి మరణ వార్త తెలుసుకున్న ధృతి వెంటనే బయలుదేరి ఇప్పుడే పునీత్ పార్థివదేహం వద్దకు చేరుకుంది.
అనూహ్య మరణంతో అందరికీ దూరమైన పునీత్ మరణ వార్త ప్రేక్షకులకే నమ్మశక్యంగా లేదు. అలాంటిది తన కూతురు ధృతి తన తండ్రి పార్థివదేహాన్ని చూసి తీవ్ర ఉద్వేగానికి గురైంది. తనను ఎలా ఓదార్చాలో ఎవరికీ అర్థం కాలేదు. తనను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తన తండ్రికి ఇంతకాలం దూరంగా ఉన్న ధృతి ఇన్నాళ్ల తర్వాత ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు.
ధృతి వచ్చిన వెంటనే పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహాన్ని ఫ్రీజర్‌లో నుండి తీశారు. చివరిసారిగా తన తండ్రి తలనిమురుతూ ఆయనను స్పర్శను గుర్తుచేసుకుంది ధృతి. ఈ సంఘటన చూస్తు్న్నవారి గుండెలను మరింత బరువెక్కేలా చేసింది. పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆయన కూతుళ్లకు తీర్చలేనిదిగా మిగిలిపోతుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com