Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్.. అన్న కోసం..

Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త ఒక్కసారిగా శాండిల్‌వుడ్‌ను అతలాకుతలం చేసేసింది. సినీ ప్రముఖుల మాత్రమే కాదు రాజకీయ నాయకులు, ప్రజలు, ఆయన అభిమానులు ఎంతోమంది పునీత్ మరణవార్తను నమ్మలేకపోతున్నారు. అప్పటివరకు వారి మధ్యే సరదాగా ఉన్న పునీత్ ఒక్కసారిగా తమకు లేరు అనుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఈరోజు ఉదయాన్నే తన అన్న సినిమా గురించి చివరిగా ట్విట్ చేశారు పునీత్.
రాజ్‌కుమార్ వారసులు అందరూ సినిమాల్లోనే ఉన్నారు. అందులో పునీత్ చిన్నవాడు. వీరంతా ఒకే ఫీల్డ్‌లో హీరోల్లాగా పోటీపడుతున్నా కూడా ఏ బేధభావం లేకుండా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే పునీత్ రాజ్‌కుమార్ కూడా తన అన్న శివరాజ్‌కుమార్ సినిమాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.
శివరాజ్‌కుమార్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో భజరంజీ కూడా ఒకటి. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ సిద్ధమయింది. భజరంగీ 2 టైటిల్‌తో రానున్న ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. దానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు పునీత్. అదే ఆయన ఆఖరి ట్వీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com