Puneeth Rajkumar: ఆ రోజు మరణం గురించి పునీత్ రాజ్ కుమార్ చెప్పిందే ఈరోజు నిజమైంది..
Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: మామూలుగా తరువాత నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విన్నప్పటి నుండి చాలామంది మనసులో ఇదే విషయం కదులుతుంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఉన్నపళంగా మన మధ్య లేరు అనే వార్త తట్టుకోవడం చాలా కష్టం కదా.. ఇవన్నీ చూసిన తర్వాత జీవితం గురించి పునీత్ ఒకప్పుడు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి.
'భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి రాతను ఎవరూ మార్చలేరు' అని ఒక ఇంటర్వ్యూలో అన్నారు పునీత్. ఆరోజు ఆయన చెప్పిన అభిప్రాయం ఈరోజు ఆయన విషయంలోనే నిజమయిందని అభిమానులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ 'అప్పుడే ఎందుకు వెళ్లిపోయారు పునీత్' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ లేరన్న చేదు వార్తను జీర్ణించుకోవడం కర్ణాటక ప్రజలకు చాలా కష్టంగా ఉంది. ఇక ఆయన కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణాతీతం. రోజులాగానే పునీత్ జిమ్‌కు వెళ్లారు అనుకున్నారంతా. కానీ అలాగే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. తన మరణం కచ్చితంగా శాండల్‌వుడ్‌కు ఒక తీరని లోటుగానే మిగిలిపోతుంది. ఇకపై స్క్రీన్‌పై పునీత్ రాజ్‌కుమార్ అనే పేరు కనిపించకుండాపోతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com