Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం..
Puneeth Rajkumar: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా పునీత్ రాజ్‌కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే పునీత్ రాజ్‌కుమార్‌ను బెంగళూరులోని విక్రం ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌కు సడెన్‌గా హార్ట్‌స్ట్రోక్ వచ్చిందని, అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
పునీత్ ఆరోగ్యం విషమించిందనే వార్త తెలియగానే కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై విక్రమ్ ఆస్పత్రికి వెళ్లారు. పునీత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. కన్నడ కంఠీరవగా పేరున్న రాజ్‌కుమార్ కుమారుడే పునీత్ రాజ్‌కుమార్. ఈ కన్నక సూపర్‌స్టార్ తాజాగా యువరత్న సినిమాలో నటించారు. 46 ఏళ్ల వయసున్న పునీత్ రాజ్‌కుమార్‌కు గుండెపోటు రావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజ్‌కుమార్ హెల్త్ బులిటెన్‌ను 3 గంటలకు విడుదల చేస్తామని విక్రం ఆస్పత్రి స్టేట్‌మెంట్ ఇచ్చింది.
పునీత్ రాజ్‌కుమార్ 1975, మార్చి 17న జన్మించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా విక్రమ్ ఆసుపత్రికి తరలివస్తున్నారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ నివాసానికి అభిమానులు తరలివస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ అన్న శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ ఆసుపత్రికి వచ్చారు. అటు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com