Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్.. ఈ వీడియోలో ఉన్నట్టు మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో..!

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మృతిని తట్టుకోలేక కన్నడ నేల కన్నీటిమయమైంది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మృతిని తట్టుకోలేక కన్నడ నేల కన్నీటిమయమైంది. అప్పూ.. వి మిస్ యూ అని కన్నీటితో నిండిన కన్నులతో చూస్తూ.. బరువెక్కిన గుండెను అదిమి పడుతూ... ఉద్వేగంతో కూడిన మాటలను పలుకుతూ.. పునీత్ జ్ఞాపకాలను తలచుకుంటోంది. హీరోగా ఎంత పేరు వచ్చిందో.. సమాజ సేవకుడిగా అంతకంటే పదింతల ఎక్కువ పేరే సంపాదించుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. అలాంటి హీరో మళ్లీ వస్తే బాగుండును అని ఆయన అభిమానులంతా మనసారా కోరుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా.. పునీత్ ను చూసే అది నేర్చుకోవాలి. స్టార్ హీరో అన్న గర్వం ఏమాత్రం కనిపించదు. తన సహ నటీనటులతో పాటు అభిమానులకు కూడా సర్ ప్రైజ్ ఇవ్వడంలో పునీత్ చాలా ముందుంటారు. అందుకే ఆయన మరణం తరువాత కూడా అలాంటి వీడియోలు నెట్ లో జోరుగా షేర్ అవుతున్నాయి. అలాంటివాటిలో ఒక వీడియో మాత్రం ట్రెండింగ్ లో ఉంది.

ఈ వీడియోలో ఉన్నట్టే పునీత్ నిజంగా మళ్లీ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా అని ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నారు. యువరత్న సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయన ఓ సర్ ప్రైజ్ వీడియోను ప్లాన్ చేశారు. అభిమానులు తన గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వెనక నుంచి వచ్చి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఒక్కసారిగా తమ ఫేవరెట్ సూపర్ స్టార్ ని అలా చూసేసరికీ వాళ్లకు నోట మాట రాలేదు. భావోద్వేగంతో గట్టిగా హగ్ చేసుకున్నారు.

ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నట్టే.. పునీత్ మళ్లీ తిరిగి వస్తే బాగుండును అని అభిమానులంతా కోరుకుంటున్నారు. కానీ గతాన్ని తిరిగి తీసుకురాలేం. కాలం గమనాన్ని ఎవరూ ఆపలేం. ఇప్పుడు జరిగింది అదే. ఈ వీడియోను బీజేపీ నేత పీసీ మోహన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అది వైరల్ గా మారింది. పునీత్ రాజ్ కుమార్ మంచి స్వభావం.. అన్ని తరాల వారికి ఆయనను చేరువ చేసింది. ఆయన నిజాయితీ మన మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అన్న అర్థం వచ్చే క్యాప్షన్ తో ఈ వీడియోను ట్వీట్ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story