Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ రీమేక్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..

Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మంచి కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండేవారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే కాకుండా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా ఆయన చేసే కమర్షియల్ సినిమాలకు మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన 29 సినిమాల జర్నీలో కొన్ని తెలుగు రీమేక్‌లను కూడా చేశారు.
ఇప్పటికీ పునీత్ రాజ్‌కుమార్‌ను తన అభిమానులు ప్రేమగా అప్పు అనే పిలుచుకుంటారు. తాను నటించిన 'అప్పు' సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇది తెలుగులో రవితేజ నటించిన ఇడియట్ సినిమాకు రీమేక్. దీనిని కన్నడలో డైరెక్ట్ చేసింది కూడా పూరీ జగన్నాధే. ఈ కథను రాసుకున్న తర్వాత పూరీ ముందుగా దీనిని కన్నడలో తెరకెక్కించాలన్న ఉద్దేశ్యంతో పునీత్‌కు కథను వినిపించాడు. తన డెబ్యూకు ఇలాంటి కథే కరెక్ట్ అనుకున్న పునీత్.. అప్పుగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
'అప్పు' గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పునీత్.. ఆ తర్వాత కూడా కొంతకాలం రీమేక్ సినిమాలతో మంచి విజయాలనే అందుకున్నారు. ఎన్‌టీఆర్ హీరోగా తెలుగులో గ్రాండ్‌గా విడుదలయిన చిత్రం 'ఆంధ్రావాలా'. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా మెప్పించలేకపోయింది. అయినా కూడా దీనిని 'కన్నడిగా' పేరుతో కన్నడలో రీమేక్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. ఈ సినిమాలో ఆయన యాక్షన్‌తో మాస్ ఆడియన్స్‌లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.
మహేశ్ బాబు కెరీర్‌లో ఎన్నో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాలు ఉన్నాయి. అందులో రెండిటిని కన్నడలో రీమేక్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. ముందుగా మహేశ్ నటించిన 'ఒక్కడు' చిత్రాన్ని 'అజయ' టైటిల్‌తో రీమేక్ చేసి హిట్ కొట్టారు. అది విడుదలయిన చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ 'దూకుడు' రీమేక్ 'పవర్'తో కన్నడ ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు సినిమాలు కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచాయి. పునీత్ రాజ్‌కుమార్ చేసిన చాలావరకు సినిమాలు కూడా ఇతరేతర భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయాలనే సాధించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com